ఫోకస్

నయవంచక పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లుగా విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. గిరిజనులకు, ముస్లింలకు మంత్రివర్గంలో స్థానం లేకుండా పాలన సాగిపోయింది. గోదావరి పుష్కరాల్లో 29మంది మృతికి కారకులెవరో తేల్చలేదు. కృష్ణా పుష్కరాల్లో 15మంది మృత్యువాతకు సమాధానం లేదు. హుదూద్ బాధితులకు ఇప్పటివరకూ తగిన సాయంలేదు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా సక్రమంగా అందించలేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు సరిగా ఇవ్వలేదు. కొన్ని సంక్షేమ హాస్టళ్లు మూసివేశారు. విజయవాడలో భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా పురాతన దేవాలయాలను కూల్చేశారు. రైతులకు వ్యతిరేకంగా బలవంతపు భూసేకరణ చేస్తున్నారు. వెనుకబడ్డ జిల్లాలకు న్యాయం చేయలేదు. ఉపాధి హామీ చట్టాన్ని అమలుచేయక లక్షలాది కూలీలు వలసలు వెళ్లారు. డ్వాక్రా మహిళల పేరుతో ఇసుక దందాలు చేసుకున్నారు. ఇప్పటివరకూ కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా సుమారు లక్ష మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారు. రాజధానికి సంబంధించి వందల్లో రహస్య జీవోలు ఇచ్చారు. రైతు పాస్‌బుక్‌లను రద్దు చేశారు. దళితులు, ముస్లింలకు దేవాదాయ భూములు ఇవ్వకూడదంటూ జీవో ఇచ్చారు. 20మందికి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించారు. అన్నిటికన్నా కేంద్రం నుంచి ఏపి పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టిన అంశాలను నీరుకారుస్తూ కొన్ని అంశాలను మాత్రమే ప్యాకేజీగా చూపెడుతున్న కేంద్రంలో కుట్రలో చంద్రబాబు భాగస్వామి అయ్యారు. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాక మాటమార్చారు. హోదా తనవల్లే వచ్చిందని సన్మానాలు చేయించుకున్న వెంకయ్య నాయుడు మాటమార్చి ఏపికి ప్రత్యేక హోదా అర్హతలు లేవన్నారు. తర్వాత చట్టంలో పెట్టలేదన్నారు. తర్వాత హోదా వల్ల ఏమి వస్తుందన్నారు. తర్వాత నీతి ఆయోగ్‌కు అప్పగించామన్నారు. తర్వాత ఇతర రాష్ట్రాలు అంగీకరించవన్నారు. తర్వాత 14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వొద్దని చెప్పిందన్నారు. ఎన్నిమాటలు మార్చాలో తెలుగు ప్రజలందరికీ తెలుసు. ‘ఓటుకు నోటు కేసు’లో ఇరుక్కున్న చంద్రబాబు పూర్తి అవినీతిలో కూరుకుపోయి మోదీకి మోకరిల్లాడు. హోదా సంజీవిని కాదంటూ బిజెపికి వంతపాడాడు. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ సంస్థ అవినీతిలో ఆంధ్రప్రదేశ్‌కు నెంబర్-1 స్థానాన్ని ఇచ్చింది. ఇంతకన్నా ఏమిచెప్పాలి బాబుగారి అవినీతి గురించి. అలాగే రాష్ట్రంలో దళితులపై వివక్ష, అణచివేతల్లో దేశంలోనే 4వ స్థానాన్ని, మహిళలపై వివక్ష, అత్యాచారాలు, వేధింపుల అంశాల్లో దేశంలోనే 6వ స్థానానికి రాష్ట్రాన్ని చేర్చారంటే చంద్రబాబు పాలనా తీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

- ఎన్ రఘువీరారెడ్డి, ఏపిసిసి అధ్యక్షుడు