ఫోకస్

ప్రజల్లో సంతోషమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర ప్రభుత్వం రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు అత్యధికంగా లబ్ధిపొంది స్వశక్తిపై నిలబడాలన్న ఉద్దేశ్యంతో వినూత్న కార్యక్రమాలు, పథకాలకు శ్రీకారం చుడుతోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయని, అనుసరించని ఎన్నో కార్యక్రమాలకు, పథకాలకు, విధానాలకు ప్రాణం పోసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది. అందుకే ప్రభుత్వ కార్యక్రమాలపై 80శాతం మంది సంతృప్తి చెందాలని, తద్వారా ప్రజల్లో సంతోషం నిండాలన్న భావనతో చంద్రబాబు పాలనా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే ప్రతి పథకం, విధానాలు లబ్ధిచేకూరేలా ‘ప్రజలే ముందు’ అనే స్ఫూర్తితో పాలన లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విస్తృతస్థాయిలో ప్రజామోదం ఉన్న పథకాలకు పెద్దపీట వేస్తూ ప్రజల ఉపాధి, ఆదాయం పెంపునకు మార్గాల అనే్వషణ, అమలుకు కృషిచేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచడమే పరమావధిగా పనితీరు ఉండాలని ప్రతి సమావేశంలోనూ అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇందుకోసం అత్యవసర, స్వల్పకాల, దీర్ఘకాలిక విధానాలను అనుసరించాలని అధికారులకు సూచిస్తున్నారు. వ్యవసాయాన్ని సుస్థిరం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు పంటలను మార్చుకోవడం వంటి పద్ధతుల ద్వారా ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే మార్గాలను అనుసరించాలని సూచిస్తున్నారు. ఉద్యానవన శాఖలో ఆశించిన స్థాయిలో లక్ష్యాలను సాధిస్తున్నా మరింత సమర్థంగా పనిచేయగలిగితే వ్యవసాయానుబంధ రంగాలన్నీ కలిపితే వచ్చే వృద్ధి ఈ ఒక్క రంగంలోనే సాధించగలం. కౌలు రైతులకు ఎలాంటి తనఖా లేకుండా పంట రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు సేవలందించేందుకు ‘అగ్రిస్మార్టు’ సర్వీస్ సెంటర్లను ప్రవేశపెడుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం రైతు పక్షపాతి.

- సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి