ఫోకస్

ఘోర వైఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. మ్యానిఫెస్టోలో చెప్పిన ఒక హామీని కూడా అమలుచేయలేకపోయింది. తెలంగాణ రాష్ట్రం ఎవరి జాగీరు కాదు, తెలంగాణ ప్రజలకు సేవ చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా. ఇటీవల జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చినపుడు కేంద్రం ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా సహకరిస్తోందో, ఏ మేరకు నిధులు సంస్థలు ఇచ్చిందో, పథకాలను కేటాయించిందో, ఏ విధంగా విద్యుత్ కొరత తీర్చడంలో సహకరించిందో చెప్పారు. వివరాలు చెప్పడమే తప్పా? మరోపక్క టిఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను సకాలంలో ఖర్చు చేయలేని స్థితిలో ఉంది, మూడేళ్ల టిఆర్‌ఎస్ పాలనలో బిసిలు మరింత వెనుకబడిపోయారు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పలేదా... మూడు ఎకరాలు చొప్పున భూమి ఇస్తామని చెప్పారు... అమలు చేశారా? మత రిజర్వేషన్లతో బిసిలకు వెన్నుపోటు పొడవడం కేసిఆర్ వైఫల్యం కాదా? తెలంగాణ వ్యతిరేకంగా పనిచేసిన ఎంఐఎం అజెండాను అమలు చేయడం వాస్తవం కాదా? ఎంఐఎంకు భయపడి సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం సమంజసమేనా? హైదరాబాద్‌ను ఇస్తాంబుల్ చేస్తాం...కరీంనగర్‌ను లండన్ చేస్తాం అన్నారు అదేమైందో ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదు?

- డాక్టర్ కె లక్ష్మణ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు