ఫోకస్

హామీ ఇచ్చారు.. అమలు మరిచారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర పాలన ‘నేలవిడిచి సాము చేసిన’ చందంగా మారింది. మూడేళ్ల పరిపాలన మరో ప్రజా ఉద్యమానికి మార్గం వేసినట్టవుతోంది. ప్రభుత్వం వైపునుండి వాగ్దానాల పరంపర సాగుతోందేతప్ప, ఆచరణలో సత్ఫలితాలు రావడం లేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి రాజ్యమేలుతోంది. 2019లో ఒకే పర్యాయం పార్లమెంట్‌కు, అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తుండటంతో, ఎన్నికల్లో విజయం సాధించాలన్న తలంపుతోనే కెసిఆర్ కొత్త పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారనిపిస్తోంది. రైతులకు ఎకరాకు నాలుగువేల రూపాయల ఆర్థిక సాయం ఈ కోవలోకే వస్తుంది. మహిళలకు ప్రాధాన్యత ఇస్తామంటూ విపరీతంగా ప్రచారం చేసుకుంటున్న కెసిఆర్ తన మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు.

- సిహెచ్ సీతారాములు, సిపిఎం నాయకుడు.