ఫోకస్

ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను మోసం చేస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు. ఈ మూడేళ్లలో 3500మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రజాసమస్యలపై పోరాడేవారి గొంతులను నొక్కడమే కాకుండా గిట్టుబాటుధర కల్పించాలని అడిగిన రైతులకు టెర్రరిస్టుల మాదిరిగా సంకెళ్లు వేసిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఎన్నికల మ్యానిఫెస్టోను తుంగలో తొక్కారు. ప్రతి నియోజకవర్గంలో వందపడకల ఆసుపత్రిని మరిచిపోయారు. పాలిటెక్నిక్ కళాశాల ఊసేలేదు. కెటిఆర్‌ను భవిష్యత్తులో ముఖ్యమంత్రిని ఎలా చేయాలి అనే దానిపైనే దృష్టి సారించారని అందులో భాగంగానే ప్రతిపక్షాల గొంతును నొక్కారన్నారు. ప్రాజెక్టుల రిడిజైన్ పేరిట పెద్దఎత్తున ముఖ్యమంత్రితో సహమంత్రులకు, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ముడుపులు ముడుతున్నాయ. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లతోపాటు తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడేనని చెప్పి ఆ వర్గాన్ని మోసం చేసిన వ్యక్తి కెసిఆర్. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. విద్యా, వైద్యరంగం నిర్లక్ష్యానికి గురైంది. నియామకాలు అసలే లేవు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు గాలికి వదిలేశారు.

- చల్లా వంశీచంద్‌రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే