ఫోకస్

ఏం ఒరగబెట్టారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన ఈ మూడేళ్ళలో ఒరగబెట్టింది ఏమీలేదు. మాటల ప్రభుత్వం అని తేలిపోయింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ మాటల గారడీ చేస్తున్నారు. ఇంకా సెంటిమెంట్‌ను రెచ్చగొడుతూ కాలం గడుపుతున్నారు. మీరు చేసిందేమిటో చెప్పాలని గట్టిగా నిలదీస్తే కేసులు పెడుతున్నారు లేదా తెలంగాణ ద్రోహులని విమర్శిస్తున్నారు. ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత వస్తుందని భావించిన ముఖ్యమంత్రి కెసిఆర్ సర్వేల పేరిట కాలాయాపన చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వంపై ప్రజలకు అంత నమ్మకం ఉంటే, ఇతర పార్టీలనుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి, తిరిగి ఉప ఎన్నికల్లో గెలిపించుకోవాలి. 24 గంటలు విద్యుత్తు ఇవ్వడానికి మా ప్రభుత్వమే కారణం. మేము అధికారంలో ఉన్నప్పుడు చేసిన కృషి ఫలితంగానే ఈ ప్రభుత్వం విద్యుత్తు ఇవ్వగలుగుతున్నది. రైతుల కష్టాల గురించి ఎందుకు మాట్లాడడం లేదు. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి కుటుంబ పాలన కొనసాగిస్తున్నారు.

- డి.కె. అరుణ, ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు