ఫోకస్

మూడేళ్లలో అరవై ఏళ్ల అభివృద్ధి టిఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మగౌరవంతో కూడిన అద్భుతమైన అభివృద్థిని కెసిఆర్ చేసి చూపించారు. అన్ని చెరువులను మిషన్ కాకతీయ పథకం ద్వారా జీవం పోసుకుంటున్నాయ. మూడేళ్లలోనే 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని చేసి చూపించిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కింది. తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా చేయాలనే ముఖ్యమంత్రి ఆశయం త్వరలోనే నెరవేరుతుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామానికి బీటి రోడ్డు సౌకర్యం, ప్రతి మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి డబుల్‌లైన్ రోడ్లు వేశారు. కళ్యాణలక్ష్మీ, షాదిముబారక్ పథకంతో పేద ప్రజల ఆదరణ అభిమానాలను ప్రభుత్వం చురగొంది. అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు, ఉద్యోగులకు వేతనాల పెంచడంతోపాటు పోలీసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వాహనాలతో పాటు ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ప్రతినెల మెయింటనేస్ కింద నిధులు ఇస్తున్నారు. రాష్ట్రంలోని పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తూనే కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా గత ప్రభుత్వం వదిలేసింది. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది. ఎన్నికల మ్యానిఫేస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేరుస్తూనే, ఇవ్వని హామీలను కూడా నేరవేరుస్తున్న ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదే.

- శ్రీనివాస్‌గౌడ్, మహబూబ్‌నగర్ తెరాస ఎమ్మెల్యే