ఫోకస్

దూసుకుపోతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుదీర్ఘకాల పోరాటాలు, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో స్వయం పాలనకు మూడేళ్లు నిండిన తరుణంలో కొత్త రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో, ఆదాయ వనరుల్లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా దూసుకుపోతున్నాం. 24 లక్షల పంపు సెట్లున్న తెలంగాణ వ్యవసాయ రంగానికి తొమ్మిది గంటల నిరంతర విద్యుత్‌తోపాటు పరిశ్రమలకు సైతం కోతల్లేని విద్యుత్ అందించడం మూడేళ్ల పాలనలో సాధించిన గొప్ప విజయం. విద్యుత్ స్వావలంబనకు రామగుండం, దామచర్ల యాదాద్రి థర్మల్ ఫ్లాంట్‌లను, మహబూబ్‌నగర్‌లో సోలార్ ఫ్లాంట్‌ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. 6575మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంతో మొదలైన తెలంగాణ విద్యుత్ పయనం మూడేళ్లలో 12వేల మెగావాట్లకు చేరింది. 29వేల మెగావాట్ల ఉత్తత్తి సాధన లక్ష్యం దిశగా పురోగమిస్తున్నాం. 17.82 శాతం ఆదాయ వృద్ధిరేటుతో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలబడటం కెసిఆర్ పాలన దక్షతకు నిదర్శనం. ఏ రాష్ట్రంలో లేని రీతిలో వేయి రూపాయల ఆసరా పింఛన్లు 38లక్షల మందికి ప్రభుత్వం అందిస్తోంది. రైతులకు 17వేల కోట్ల మేరకు రుణాలు మాఫీ చేశాం. రికార్డు స్థాయిలో పంటల దిగుబడులు పెరిగిపోయినా రైతులకు ఇబ్బందులు కలుగవద్దన్న లక్ష్యంతో కేంద్రం సహకరించకపోయినా అన్ని పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్నాం. గిడ్డంగుల సామర్థ్యం, మార్కెటింగ్ వసతులు పెంచుకున్నాం. త్వరలో ఎకరాకు రైతుకు ఏటా రెండు పంటలకు నాలుగు వేల చొప్పున సాగు పెట్టుబడికి సహాయాన్ని కెసిఆర్ ప్రభుత్వం అందించబోతుంది. 10వేల కోట్లతో సబ్సిడీ గొర్రెల పంపిణీ, మత్స్యకార్మికులకు చేప పిల్లల పంపిణీ, రజక, నాయిబ్రహ్మణ వృత్తిదారుల సంక్షేమానికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించాం. చేనేత కార్మికులకు బడ్జెట్‌లో 1200కోట్లు కేటాయించాం. ఆడపిల్లల సంక్షేమానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లకు తోడుగా కొత్తగా కెసిఆర్ కిట్ రాబోతుంది. మూడేళ్లలో 360పథకాలను కెసిఆర్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మైనార్టీలకు 12శాతం, గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపచేసి రాష్టప్రతికి పంపించాం. డబుల్ బెడ్‌రూమ్‌ల ఇళ్ల నిర్మాణం ఊపందుకుంది. కెజి టూ పిజి ఉచిత విద్య అమలు దిశగా అడుగులు వేస్తున్నాం.

- జి.జగదీష్‌రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి