ఫోకస్

నిషేధం సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వం పశువధను నిషేధించింది. కేంద్రం చేసిన చట్టాన్ని కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మేఘాలయ ప్రభుత్వాలు వ్యతిరేకించాయి. ఈ రంగంపై ఆధారపడ్డ 2కోట్లకు పైగా జనాభా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. వారికి ప్రత్యమ్నాయ మార్గాలను స్పష్టంగా సూచించలేదు. కేంద్రం జారీచేసిన ఆదేశాల ప్రకారం ఆవులు, గేదెలు, ఎడ్లు, దున్నపోతులు, ఒంటెలను కబేళాలకు విక్రయించడం నేరం. మన దేశంలో ప్రస్తుతం ఏటా లక్ష కోట్ల రూపాయల మేర టర్నోవర్ జరుగుతోంది. 2016-17లో మన దేశం నుంచి రూ.26వేల కోట్లకు పైగా మాంసం ఎగుమతి జరిగింది. పశుమాంసం ఎగుమతులలో ఉత్తరప్రదేశ్ అగ్రభాగంలో ఉంది. ఇక్కడనుంచే దాదాపు 20 శాతం మాంసం ఎగుమతి అవుతోంది. అటువంటి రాష్ట్రంలో గో రక్షణ కమిటీల పేరుతో అరాచకాలు, హత్యలు, దాడులు జరుగుతున్నాయి. 2007-12 ఏళ్ల మధ్య కాలంలో దేశంలో అధికారికంగా 39వేలు, అనధికారికంగా మరో 30వేల కబేళాలు ఉన్నట్టు ప్రణాళికా సంఘం పేర్కొంది. వట్టిపోయిన ఆవులను, గేదెలను ఏం చేయాల్లో పాలుపోని పరిస్థితి. అందువల్లనే రైతులు కొత్త ఆవులు, గేదెల కొనుగోలు శక్తి తగ్గిపోయి పాల ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది. రైతులకు భారంగా మారిన పశుపోషణను ప్రభుత్వాలు స్వీకరించాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా, పాడి రైతుల గురించి కొంచెంకూడా ఆలోచించకుండా ఈ రకమైన ఆదేశాలు ప్రభుత్వం ఇవ్వడంలో పశునిషేధ చట్టం అమలు చేయడం సాధ్యమేనా అన్నదీ ప్రశ్నార్ధకమే.
- డాక్టర్ ఎంవిఆర్ కృష్ణాజీ
అధ్యక్షుడు జాతీయ వర్కింగ్ కమిటీ,
జనవిజ్ఞాన వేదిక