ఫోకస్

రూపురేఖలు మేమే మార్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్‌తోనే గ్రేటర్ హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుంది. గ్రేటర్ హైదరాబాద్ రూపురేఖలు మార్చింది మేమే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రేటర్ హైదరాబాద్ ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. ప్రపంచ పటంలో హైదరాబాద్‌కు గుర్తింపు తీసుకువచ్చాం. టిడిపి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చెందలేదు. ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ, సైబర్ టవర్ నిర్మాణం చేయగానే, మొత్తం హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల శివారు ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాయని టిడిపి ప్రచారం చేసుకుంటున్నది. 173 కిలో మీటర్ల పొడువున అవుటర్ రింగ్ రోడ్డు (ఒఆర్‌ఆర్), శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది కాంగ్రెస్సే. ఇవన్నీ చరిత్రలో నిలిచిపోతాయి. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని వివిధ పార్టీలు కాంగ్రెస్ హయాంలో ఏమి సాధించినట్లు అని ప్రశ్నించడం అవివేకం.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హై-టెక్ సిటీ, జూబ్లీహిల్స్, మాదాపూర్ మినహా మిగతా ప్రాంతాలను పట్టించుకోలేదు. సంపన్నవర్గాలు నివసించే ప్రాంతాలపైనే దృష్టి పెట్టింది తప్ప, పేద, మధ్య తరగతి కుటుంబీకులు నివసించే ప్రాంతాలపై దృష్టి మరల్చలేదు. పేద, బడుగువర్గాలు నివసించే మురికివాడలను నిర్లక్ష్యం చేసింది. పాతనగరాన్ని అసలే పట్టించుకోలేదు. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాతనగరంపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరిగింది. రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. చార్మినార్, ఫలక్‌నుమా బస్సు డిపోలను ఆధునీకరించాం. హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ (హుస్సేన్ సాగర్) చుట్టూ నెక్లెస్ రోడ్డు నిర్మించడం ద్వారా ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడింది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అనేక చర్యలు చేపట్టాం. ఫ్లైవోవర్ల నిర్మాణం చేపట్టాం. హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) ద్వారా నగరాభివృద్ధికి విశేషంగా కృషి చేశాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం, అండర్ గ్రౌండ్ విద్యుత్ విధానం వంటివి ఇంకా ఎనె్నన్నో చేయాల్సి ఉన్నాయి. అవన్నీ పూర్తి కావాలంటే కాంగ్రెస్ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుని మేయర్ స్థానాన్ని ‘చే’జిక్కించుకోవాల్సి ఉంది. కాబట్టి, ఇప్పుడు జరగబోయే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న నమ్మకం తమకు పూర్తిగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు చాలా తెలివైనవారు. టిఆర్‌ఎస్ ఎత్తుగడలను వారు విశ్వసించరు. గత అసెంబ్లీ, లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్‌కు చుక్కెదురైంది. గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం, విశాల ప్రపంచంలో గ్రేటర్‌కు ప్రత్యేక గుర్తింపు రావడం కాంగ్రెస్‌తోనే సాధ్యం.

- వి. హనుమంత రావు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, ఎఐసిసి కార్యదర్శి