ఫోకస్

హైకోర్టు ఆదేశాలు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోమాతను వధించిన వారికి కఠిన శిక్షలు ఉండాలి. పవిత్రమైన గోమాతను వధించిన వారికి, లేదా హాని చేసేవారిపై నాన్‌బెయిల్ సెక్షన్ల కింద చట్టాలు చేయాలని హైదరాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. హైకోర్టు ఇప్పటికే నెల రోజులు గడువు ఇచ్చినా రెండు తెలుగు రాష్ట్రాల్లో చలనం లేదు. జూలై 9వ తేదీ వరకు హైకోర్టు చట్టాలకు సవరణలు చేసి గోవులను వధించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ దిశగా ఆలోచించి తక్షణమే ప్రస్తుతం ఉన్న చట్టాలకు సవరణలు చేయాలి. గోవు హిందువులకే కాదు, మొత్తం భారతీయులకు పవిత్రమైనది. ప్రపంచంలో ఏ మతం కూడా గోవులను వధించాలని చెప్పలేదు. గోవు లేకపోతే వ్యవసాయం లేదు. క్రిమిసంహారక మందులవల్ల పంట ఉత్పత్తుల దిగుబడి పెరగవచ్చు. కాని అదే సమయంలో వాటిల్లో ఉన్న క్రిమిసంహారక మందుల అవశేషాలవల్ల మానవుల ఆరోగ్యం పాడైపోతోంది. గో సంరక్షణ, గోవుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం చట్టాలు తేవాలి. ప్రాచీనకాలం నుంచి కూడా అఖండ భారతదేశం అంటే ఈ రోజు ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బర్మా, నేపాల్, శ్రీలంక ఉన్న దేశాల్లో గోవుపూజలందుకుంది. గోసంరక్షణను ఒక మత కోణంలో చూడడం తప్పు. తల్లిలేని, తల్లిపాలకు నోచుకోలేని శిశువులకు గోవు పాలే మంచి పౌష్టికహారం. ఇటీవల కాలంలో కొన్ని రాజకీయ పార్టీలు, సంస్ధలు కేవలం మత కోణంలో ఆలోచించి గోసంరక్షణను వివాదస్పదం చేస్తున్నాయి. బీఫ్ పేరిట పండగలు చేసి సమాజంలో చీలికలు తెస్తున్నారు. గోవును పూజించే వర్గాన్ని బాధించే చర్యలకు కొన్ని సంఘాలు పాల్పడుతున్నాయి. హాస్టళ్లలో బీఫ్‌ఫెస్టివళ్లను నిర్వహిస్తున్నారు. వీరిని చదువుకోమని పంపించి మంచి ఉపకారవేతనాలు ప్రభుత్వం ఇస్తుంటే భారతీయ సమాజానికి పవిత్రమైన గోవుపట్ల హేళనగా మాట్లాడుతున్నారు. దుందుడుకు చర్యలకు పాల్పడే శక్తులపై చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలి
- కె శివకుమార్
ప్రధాన కార్యదర్శి, వైకాపా తెలంగాణ రాష్ట్ర శాఖ