ఫోకస్

అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోసంరక్షణ అనేది మన అందరి బాధ్యతగా గుర్తించాలి. ప్రతి ఒక్కరు గోసంరక్షణకు తమ వంతు కృషిచేయాలి. హిందువులకు గోమాత దైవంతో సమానం. ఈ విషయంలో ఎవరి మనోభావాలకూ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. గోమాతకు పురాణాల్లోనూ విశిష్టస్థానం ఉంది. మన పూర్వీకుల నుండి గోమాతను పూజిస్తుండటంతోపాటు గోవుద్వారా అనేక రూపాల్లో లాభం పొందుతున్నాం. అనాదిగా గోసంపదకు మన సంస్కృతిలో విశిష్టస్థానం ఉంది. ప్రాచీనకాలం నుండి గోమాత సమాజానికి చేసిన మేలు అసాధారణం. మన సంస్కృతి, సంప్రదాయాల్లో గోమాత ఒక భాగం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవనంతో గోవు మమేకమయింది. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో గోసంపద తగ్గుముఖం పడితే అనేక దుష్ఫలితాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మన దేశానికి ఎంతో మేలు చేకూర్చిన గోమాత రుణాన్ని ఏమిచ్చినా తీర్చుకోలేం. వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాల్లో పురోగమించాలంటే గోసంపద రక్షణ ద్వారానే సాధ్యమవుతుంది. ఇటీవలి కాలంలో అనేకచోట్ల గోసంరక్షణ కేంద్రాలు వెలుస్తుండటం హర్షణీయం. అనేకమంది గోసంరక్షణ కేంద్రాలను ఏర్పాటుచేసి, వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకుంటున్నారు. గోవును పూజించడం అంటే భగవంతుడిని ఆరాధించడమేనన్న ఆలోచనతో ఆయా వర్గాల వారు ఈ పుణ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు గోసంరక్షణ సంఘాలు చేస్తున్న కృషి విశేషం! మధ్యప్రదేశ్‌లో ఏకంగా గోవధనే నిషేధించారు. ప్రభుత్వాలు గో సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
-తోట నరసింహం
పార్లమెంట్ సభ్యుడు, కాకినాడ,
లోక్‌సభలో టిడిపి ఫ్లోర్‌లీడర్