ఫోకస్

చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొడ్డు మాంసంపై నిషేధం లేదని అంటారు... అలాంటప్పుడు గోవధ చట్టానికి అర్థం లేదు. అయినప్పటికీ గోవులను వధశాలకు తరలించడాన్ని నిషేధించినట్టు కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోంది. ప్రజలలో అపోహలు తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం గోవధ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. అశాస్ర్తియమైన అవగాహనతో సంఘ్ పరివార్ అనారోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. మాంసాహారుల్లో 60 నుంచి 70 శాతం మంది గొడ్డు మాంసాన్ని తినేవారు ఉన్నారు. ఇందులో ఎక్కువగా ప్రోటీన్లు ఉండటం వల్ల అధికంగా భుజిస్తున్నారు. భిన్నమైన పద్ధతులలో మాంసాహారాన్ని తగ్గించి శాకాహారులను పెంచేందుకు సంఘ్ పరివార్ ప్రయత్నిస్తోంది. శ్వాసపీల్చే సందర్భంలో సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి చనిపోకుండా జైన మతస్తులు ముక్కు, నోటికి గుడ్డను అడ్డంగా కట్టుకుంటారు. ఈ విధంగా ప్రతీది జంతు హింస అంటే అందరూ జైనులుగా మారాల్సిందే. సంఘ్ పరివార్ ప్రజల ప్రాథమిక హక్కులను సైతం హరించేలా వ్యవహరిస్తుంది. లౌకిక రాజ్యాన్ని హిందు మత రాజ్యంగా మలచడంలో భాగంగానే సంఘ్ పరివార్ గోవధ నిషేధం చట్టాన్ని తీసుకొచ్చింది.
- సురవరం సుధాకర్‌రెడ్డి
సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి