ఫోకస్

రక్షించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆవు అనేది ఒక జంతువు మాత్రమే కాదు. సనాతన ధర్మంలో అదొక జీవన విధానం. భారతీయ వ్యవసాయ రంగంలో ఆవుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. గృహప్రవేశాలు తదితర శుభకార్యాల్లో కూడా దీన్ని తప్పని సరిగా వినియోగించుకుంటూ వస్తున్నాం. భారతీయ జీవనాడి అయన ఆవును రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇప్పుడు మనకు కావలసింది గోవధ నిషేధం కాదు.. మనుషుల మనస్సుల్లో మార్పు. కేవలం పాలిచ్చే జంతువుగానో, కోసుకుని మాంసాన్ని భుజించే జంతువుగానో పరిగణించడం సరైన విధానం కాదు. ఆవు ఏ మతానికి సంబంధించింది కాదు. అనవసరంగా దీన్ని ఒక మతానికి సంబంధించిన దానిలాగా ప్రచారం చేస్తున్నారు. భారత్‌తోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక తదితర అనేక దేశాల్లో ఆవుకు ప్రత్యేక స్థానం ఉంది. అమ్మతో సమానమైంది ఆవు అని మనం మొదటి నుండి చెప్పుకొంటూ వస్తున్నాం. మన సమాజం వ్యవసాయ రంగంపై ఎక్కువగా ఆధారపడి ఉంది. వ్యవసాయంలో ఆవులు, ఎద్దులు ప్రధానమైనవి. రైతు ఉదయం లేవగానే ఆవుల మధ్య జీవిస్తుంటాడు. ఇంట్లో ఆవు ఉంటే లక్ష్మి (్ధనం) ఉన్నట్టుగానే గ్రామీణ జీవనం కొనసాగుతూ వస్తోంది. లేగదూడగా ఉన్నప్పటినుండి రైతు దాన్ని కాపాడుకుంటూ వస్తుంటాడు. ఆవు మందలున్న ప్రాంతంలో వాతావరణ ఆహ్లాదకరంగా ఉంటుంది. పాలతోపాటు పేడ అనేక అవసరాలకు వినియోగిస్తూ ఉంటాం. మూత్రం మందులకు ఉపయోగపడుతోంది. పాలు, మూత్రం, పేడ, పిడకలు యజ్ఞాలు, యాగాల్లో వినియోగిస్తున్నారు. తల్లిపాలు లేని చంటి పిల్లలకు ఆవుపాలు ఆహారంగా ఇస్తుంటారు. అందుకే ఆవును భగవత్ స్వరూపంగా హిందూసమాజం భావిస్తోంది. సకలదేవతలు ఆవు శరీరంలో ఉంటారని భావిస్తున్నారు.
గోసంరక్షణపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. చాలా రాష్ట్రాలు గోహత్యను నిషేధించాయి. కొంతమంది గోమాంసంపై రచ్చచేస్తున్నారు. యూనివర్సిటీలో కూడా ఆవుమాంసంపై చర్చ జరిగింది. కేవలం ఒక మతం వారికి ఆవుమాంసం అందకుండా ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అది సరైన విధానం కాదు. మాంసాహారులు తినడానికి మేకలు, గొర్రెలు, కోళ్లు అనేకం ఉన్నాయి. రైతులకు అండగా ఉండే ఆవులను కోయడం ఎందుకు, గోహత్య చేయడం ఎందుకు అన్న అంశానికి ప్రాధాన్యత లభిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిపై విమర్శలు చేసేందుకు ఆవును రాజకీయ అవసరాలకోసం విపక్షాలు వినియోగించుకుంటున్నారని చాలామంది భావిస్తున్నారు. ఆవును రాజకీయాల్లోకి లాగడం మానివేసి, మన సంప్రదాయం, సంస్కృతి కోణంలో చూడాల్సిన అవసరం ఉంది.
- కెండ్యాల రాజేశ్వర్
గోసంరక్షణ సంఘం తెలంగాణ అధ్యక్షుడు