ఫోకస్

గోవధ వద్దు.. రక్షణే ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవధ తగదు.. హిందూ ధర్మాచారం ప్రకారం గోవును దేవతగా ఆరాధిస్తాం. అలాంటి దేవతని వధించరాదు. ఆర్గానిక్ ప్రకారం గోవు ఎంతో మంచిది. గోవు పంచకంతోపాటు, ఆవుపాలు ఎంతో ఉపయోగకరం. ఆవుపాలు లీటరు 120 నుండి 130 రూపాయల వరకు పలుకుతున్నాయి. గోవును రక్షించటం వల్ల భావితారాలకు ఎంతో మేలు జరుగుతుంది. అంతర్జాతీయంగాను, దేశీయంగాను ఒంగోలు జాతి గిత్తలకు ఎంతో పేరు ప్రఖ్యాతలున్నాయి. అలాంటి గిత్తలు రావాలంటే మూలం ఆవులు కావాలి. అలాంటి గోవులను వధిస్తే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గిత్తలు ఎక్కడనుండి వస్తాయి. ఒంగోలు జాతి గిత్తలకు ప్రపంచ మార్కెట్‌లో ఎంతో విలువ ఉంది. వ్యవసాయపరంగాను గోవులు ఎంతో మేలు చేకూరుస్తున్నాయి. గతంలోను, ప్రస్తుతం రైతులు వ్యవసాయం చేయాలంటే ముందుగా ఆవుపేడను పొలాల్లో వేసి సత్తువ చేస్తారు. అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు ఎద్దులతో నాగళ్లు కట్టి భూములను దున్నుతారు. ఇన్ని ప్రయోజనాలున్న గోవును వధిస్తే రానున్న రోజుల్లో గోసంపద తగ్గిపోతుంది.
- వైవి సుబ్బారెడ్డి
ఒంగోలు ఎంపి