ఫోకస్

రాజకీయం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ అంశాన్ని రాజకీయం చేయడం మంచిది కాదు. ఈ దేశ సంస్కృతిని, ఆచారాలను వ్యతిరేకించే కమ్యూనిస్టులు గోవధ అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. గోవధ నిషేధంపై ఇప్పుడు కొత్తగా నిర్ణయం తీసుకున్నది కాదు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేశారు. రాజ్యాంగంలోనే గోవధ నిషేధం గురించి ఉంది. అయితే ఇంత కాలం అయినా దాన్ని అమలు చేయడం లేదు, కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. గోవులను కబేళాలకు తరలించకుండా ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించడాన్ని వివాదం చేస్తున్నారు. దీనిపై కేంద్రం హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం ఉంది. నేపాల్‌లో ఒక జాతరలో ఒకేసారి ఐదులక్షల గోవులను వధిస్తారు. దానికోసం భారతదేశం నుంచి అక్రమంగా వాటిని తరలిస్తారు. దీన్ని నివారించేందుకు గోవులను వీరికి అమ్మకుండా ఆంక్షలు విధించారు. ఎక్కువ మంది ప్రజలు గోవధ నిషేధ చట్టం అమలు చేయాలి అని కోరే రాష్ట్రాలున్నాయి, అలాంటి రాష్ట్రాల్లో అమలు చేయాలి. వట్టిపోయిన, ఉపయోగం లేని గోవుల విషయంలో ఏం చేయాలి అనే ప్రశ్న ఉదయిస్తుంది. సెంటిమెంట్ ఒక్కటే సరిపోదు. ఉపయోగం లేకపోయినా అలానే ఉంచుకోవాలి అంటే సెంటిమెంట్ ప్రకారం మంచిదే కానీ అది వ్యయంతో కూడుకున్నది రైతు దాన్ని భరించగలడా? ఇలాంటి ప్రశ్నిలను నేను కొందరు సాధువుల వద్ద, గో పరిరక్షకుల వద్ద ప్రస్తావించాను. పని చేయలేని స్థితికి చేరుకున్న పశువులను అరణ్యాల్లో వదలాలి. అక్కడ గడ్డి తింటూ బతికినంతకాలం బతుకుతాయి. వయసు మళ్లిన మనుషులు మరణించినట్టుగా అక్కడే మరణిస్తాయి. లేదంటే పులులు, సింహాల వంటి వాటికి ఆహారం అవుతాయి. భారీగా ఉండే ఏనుగు గడ్డి తింటుంది. పులి, సింహం వంటి వాటికి జంతువులు ఆహారం. ఇది ప్రకృతి ధర్మం. అటవీ ప్రాంతాల్లో గడ్డి పెంచి పనికి రావు అనుకున్న పశువులను అక్కడ వదిలివేయడం సరైన పరిష్కారం అవుతుంది. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. గోవధ అంశంపై ప్రభుత్వంపై బురదజల్లుదాము అనే దృష్టితో కాకుండా ప్రజల సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకోవాలి.
- త్రిపురనేని హనుమాన్ చౌదరి, ప్రజ్ఞ్భారతి