ఫోకస్

ఎవరి మనోభావాలు దెబ్బతీయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాదిగా ‘గోమాత’కు విశిష్ట స్థానం ఉంది. పురాణాల్లోనూ గోవును పూజించినట్లు ఆధారాలున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఎవరి మత ఆచారాలు వారికి ఉంటాయి. ఎవరి మత ఆచారాలు, సంప్రదాయాల్లో మరో మతం వారు జోక్యం చేసుకోరు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్చ ప్రకారం ఎవరి ఆహారపు అలవాట్లు వారివి. ఎవరు ఏమి తినాలనుకున్నా, మరొకరి అనుమతి అవసరం లేదు. అయితే హిందూ మత ఆచారం, సంస్కృతి ప్రకారం గోవుకు ప్రత్యేకమైన, విశిష్ట స్థానం ఉంది. తాము పూజించే గోవును వధించడం భావ్యం కాదని హిందూ మతస్థుల వాదన. గోవు పాలు తాగడం వల్ల, గోవు పాలతో తయారు చేసిన నెయ్యిని తీసుకోవడం వల్ల పుష్టికరంగా ఉంటారని శాస్తవ్రేత్తల అధ్యయనంలో తేలింది. గోవు పేడను వ్యవసాయదారులు తమ పంట పొలాల్లో వేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పశువధను నిషేధించింది. తాజాగా హైకోర్టు జడ్జి కూడా గోమాతను దైవ సమానంగా పోల్చారు. అయితే పశువధపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అనారోగ్యానికి గురైనా, బక్కచిక్కినా లేదా వృద్ధాప్యానికి వచ్చి సదరు రైతులకు భారంగా మారిన తర్వాత కూడా వాటిని విక్రయించేందుకు వీలులేదన్న ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడానికి ముందు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి చర్చించి ఉంటే బాగుండేది. మరోవైపు అటువంటి పరిస్థితుల్లో ఆ పశువులను ఏమి చేయాలి? రైతులకు ప్రత్యామ్నాయం ఏమి చూపించగలం? అనే కోణంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి ఎందుకు చర్చించలేదని ప్రశ్నిస్తున్నాను. అఖిలపక్ష సమావేశం నిర్వహించడంతోపాటు, దేశవ్యాప్తంగా రైతులతో ఈ అంశంపై అభిప్రాయాన్ని కోరి ఉండాల్సింది. లేదా ఏదైనా కమిటీని నియమించి రైతుల నుంచి, పశు పోషణ చేస్తున్న వారి అభిప్రాయాలను తెలుసుకుని ఉంటే బాగుండేది. గోవులను పూజించే హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఎటువంటి చర్యలు తీసుకోగలమనే అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగు ముందుకేసి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి చర్చిస్తే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది.
- పొంగులేటి సుధాకర్ రెడ్డి
ఎమ్మెల్సీ, ఎఐసిసి నాయకుడు