ఫోకస్

జాతీయ జంతువుగా గోవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందువులు గోవులను దైవంతో సమానంగా పూజిస్తారు, గో రక్షణ చట్టం తీసుకురావాలని దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో రాజస్థాన్ హైకోర్టు కేంద్రానికి పలు కీలక సూచనలు చేసింది. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని న్యాయస్థానం కేంద్రానికి సూచించింది. అంతేగాక ఆవును వధించేవారికి శిక్షను యావజ్జీవ కారాగార శిక్షకు పెంచాలని కూడా సిఫార్సు చేసింది. ఆవుల సంరక్షణపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారిస్తున్న సమయంలో ఈ సూచనలు చేసింది. మాంసంకోసం పశువుల అమ్మకాలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది, అయితే ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. జంతుప్రేమికులు, గోశాలల నిర్వాహకులు దీనిని స్వాగతిస్తుండగా, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రాల హక్కులను హరించేలా ఉందని, తాము ఏం తినాలో ఏది తినకూడదో కేంద్రం చెప్పడం సరికాదని కేరళ సిఎం పినరయ విజయన్ విమర్శించారు. అటు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా విజయన్‌కు మద్దతు పలుకుతూ కేంద్రాన్ని విమర్శించారు. ఇక కొన్నిచోట్ల బీఫ్ పండగలు నిర్వహిస్తూ, పెద్దఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. వాస్తవానికి గోరక్షణకు చట్టం తీసుకురావాలని ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని గోవధను నిషేధించాలని కోరుతూ హిందూమత పెద్దలు ఎనిమిది కోట్ల సంతకాలతో కూడిన ఒక వినతి పత్రాన్ని ఆనాటి రాష్టప్రతి ప్రతిభా పాటిల్‌కు సమర్పించారు. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుండి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవుకన్నా మిన్నగా ఉపకారం చేసే మరో జంతువు లేదు. గోవుల గురించి యజుర్వేదంలోనే ప్రస్తావన ఉంది. ప్రపంచంలో అన్నాన్ని ఉత్పత్తి చేసేవి గోవులు అని ఆర్యులు శ్లాఘించారు. అనేక పవిత్ర గ్రంథాల్లో గోవుల ప్రస్తావన ఉంది, హిందూ ధర్మ శాస్త్ర గ్రంథాల్లోనూ, భారత రామాయణ, భాగవతాది పవిత్ర గ్రంథాల్లో గోమహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది. వాల్మీకి, వ్యాసుడు, ఆది శంకరాచార్యులు, బుద్థుడు, స్వామి దయానంద సరస్వతి, తులసీదాసు, కబీరు, చైతన్య మహాప్రభువు మొదలైన వారెంతో మంది గోసంపద రక్షణావశ్యకతను నొక్కి వక్కాణించారు. శ్రీకృష్ణుడు స్వయంగా గోమాతను పూజించి, సేవించి గోపాలుడయ్యాడు. దిలీప్ చక్రవర్తి తన ప్రాణాలను త్యాగం చేసేందుకు సైతం వెనుకాడలేదు. జమదగ్ని గోరక్షణకు ఆత్మత్యాగం చేశాడు. గోవులే స్వర్గ సోపానాలని హిందువుల విశ్వాసం. ఈ జగత్తులో గోసంపదకు సమానమైన ధన సంపద చూడలేమని చ్యవన మహర్షి సైతం ప్రవచించారు. ఇదంతా ధార్మిక వ్యవహారమైతే సహజసిద్ధంగానే గోవు ప్రయోజనాలు ఇన్నీ అన్నీ కావు, అంతా ప్రకృతితో ముడిపడిన జీనవచక్రంలో భాగంగా భావించాల్సి ఉంటుంది. గోరక్షణకు సంబంధించి కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.