ఫోకస్

ఒక్క అవకాశం ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్దెనిమిది నెలల పాలనా కాలంలో మేం ఏం చేశామో చూడండి. ఇంతకాలం ఎన్నో పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఈసారి మాకు అవకాశం ఇవ్వండి 50 ఏళ్లలో మిగిలిన వారు చేయంది ఐదేళ్లలో మేం చేసి చూపిస్తాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇదే మా ప్రచారం. ఇప్పటివరకు గ్రేటర్ పీఠాన్ని కాంగ్రెస్, ఎంఐఎం, టిడిపి-బిజెపి అందరికీ ఇచ్చారు. ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడమని కోరుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో దుష్ప్రచారం చేశారు. తెలంగాణ ఏర్పడితే ఇతర ప్రాంతాల వారిని ఉండనివ్వరని, రియల్ ఎస్టేట్ పడిపోతుందని, విద్యుత్ లేక చీకటి తప్పదని ఎన్నో ప్రచారాలు చేశారు. కానీ 18నెలల్లో తెలంగాణ ప్రభుత్వం పాలన ఎలా ఉంటుందో ప్రజలే చూశారు. పద్దెనిమిది నెలల్లోనే ఎన్నో చేశాం. ఇంకా చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. వేసవి కాలం వచ్చిందంటే హైదరాబాద్‌లో విద్యుత్ కోత తప్పనిసరిగా ఉండేది. పరిశ్రమలకు వారానికి రెండు రోజుల పవర్ హాలిడే ప్రకటించే వారు. పరిశ్రమల వారు ఇందిరాపార్క్ వద్ద ఆందోళనలు జరిపిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణలో ఇలాంటి దృశ్యాలు మచ్చుకైనా లేకుండా చేయడంలో ప్రభుత్వం విజయం సాధించింది. విద్యుత్ కోతలు లేకుండా 24 గంటలపాటు సరఫరా చేస్తున్నాం. రెప్పపాటు కాలం కూడా విద్యుత్ నిలిచిపోయే అవకాశం లేకుండా హైదరాబాద్‌కు ప్రత్యేకంగా విద్యుత్ సరఫరా కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. స్కైవే ఇప్పుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరుతో హైదరాబాద్‌లో ఒకటే ఉంది. ఇలాంటివి నగరం నలువైపులా 12 స్కైవేలు నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాతిక వేల కోట్లతో హైదరాబాద్‌లో స్కైవేలు, రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. బ్రిక్స్ బ్యాంకు ద్వారా దాదాపు 30 వేల కోట్ల రూపాయల రుణంకోసం ప్రతిపాదనలు పంపించాం. హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలకోసం ఈ నిధులు వినియోగించనున్నాం. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. సికిందరాబాద్ కంటోనె్మంట్‌లోనూ టిఆర్‌ఎస్‌నే. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లోనూ టిఆర్‌ఎస్‌ను గెలిపించడం ద్వారా విశ్వనగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు మాకు ఒక్క అవకాశం ఇవ్వమని కోరుతున్నాం. హైదరాబాద్ ఒక విశ్వనగరం, మినీ ఇండియా. ఇక్కడ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఐటి రంగంలో ప్రపంచంలో మేటి నగరంగా అభివృద్ధి చెందుతోంది. అనుమానాలను పటాపంచలు చేస్తూ పలు ప్రముఖ ఐటి కంపెనీలు హైదరాబాద్‌కు వస్తున్నాయి. అమెరికా తరువాత అతి పెద్ద క్యాంపస్ కోసం గూగుల్ హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంది. అనేక కంపెనీలు వస్తున్నాయి. ఒకే ప్రాంతంలో కాకుండా నగరం చుట్టూ ఐటి కంపెనీలు విస్తరించాలనేది ప్రభుత్వ లక్ష్యం. చెప్పింది చేసి చూపిస్తాం. హైదరాబాద్‌లో మేమే అభివృద్ధి సాధించాం అని నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. వర్షం చినుకులు పడితే వాహనాలు నీళ్లలో తేలడమేనా వీళ్లు సాధించిన అభివృద్ధి. హైదరాబాద్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రికి అనేక ఆలోచనలు ఉన్నాయి. ఎన్నికల మ్యానిఫెస్టోలో హైదరాబాద్‌ను ఏ విధంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నది వివరిస్తాం. ప్రాంతాలకు అతీతంగా హైదరాబాద్ ప్రజల్లో తెలంగాణ ప్రభుత్వం విశ్వాసం కలిగించింది. మేయర్ స్థానంలో టిఆర్‌ఎస్ అభ్యర్థి ఉంటారని, లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆ నమ్మకంతోనే సవాల్ చేశాను. మంచి చేసినప్పుడు ప్రజలు ఆదరిస్తారనే పూర్తి విశ్వాసం ఉంది.

- కల్వకుంట్ల తారక రామారావు, ఐటి శాఖ మంత్రి