ఫోకస్

రైతు రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం, సమగ్రాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తోంది. అసంఘటితంగా ఉన్న అన్నదాతలను సంఘటితం చేసే దిశగా మూడు అంచెలుగా గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో రైతు సమన్వయ సమితులు ఏర్పాటవుతున్నాయి. ఇదే రీతిన రైతుబంధు, రైతు మిత్ర పేర్లతో ఆంధ్రప్రదేశ్‌లోనూ రైతు కమిటీలు ఏర్పాటవుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా రైతు సమస్యలపై పూర్తి అవగాహన ఉండి, వాటి పరిష్కారంకోసం పోరాడే వారిని పార్టీలకు అతీతంగా రైతు సమన్వయ సమితుల సభ్యులుగా ఎంపిక చేస్తారు. ప్రతి రెవిన్యూ గ్రామానికి ఒక సమితి, అలాగే ప్రతి మండలానికి ఒక సమితి, ప్రతి జిల్లాకు ఒక సమితి ఏర్పాటవుతాయి. గ్రామ రైతు సమితిలో అన్ని కులాలకు చెందిన 15 మందిని సభ్యులుగా ఎంపిక చేసి వారిలో 33 శాతం మంది మహిళా రైతులకు సభ్యత్వ అవకాశం కల్పిస్తున్నారు. 24 మందితో మండల స్థాయిలో, మరో 24 మందితో జిల్లా స్థాయిలో, 42 మందితో రాష్ట్ర స్థాయిలో సమన్వయ సమితులు ఏర్పాటవుతాయి. రైతు సమన్వయ సమితి ద్వారా ఎవరు ఏ పంటలు పండిస్తున్నారో వాటి వివరాలు సేకరించి దానికి సరిపోను విత్తనాలను 17 రోజులు ముందుగానే రైతులకు పంపిణీ చేస్తారు. పంటలకు మార్కెట్ సౌకర్యం, గిట్టుబాటు ధర వచ్చేవరకూ గోదాముల్లో ఉత్పత్తులను ఉంచుతారు. అంతవరకూ సరకులకు రుణాలు ఇవ్వడం, విత్తనాలు, ఎరువుల పంపిణీ, రైతులందరికీ భూసార పరీక్ష కార్డులు సకాలంలో అందేలా చూడటం, క్లస్టర్ కేంద్రాల్లో రైతు సంఘ భవనాల నిర్మాణం, మార్కెట్ ధర నిర్ణయించడంలో రైతు సమన్వయ సమితులకు అధికారాలు ఇవ్వాలనేది ప్రభుత్వ యోచన. ప్రభుత్వం రైతు పెట్టుబడి కోసం ఎకరాకు అందచేసే 8వేల ఆర్థిక సాయంలో రైతు సమన్వయ సమితి పాత్ర చాలా కీలకమైంది. రాష్ట్ర స్థాయి రైతు సమన్వయ సమితికి తెలంగాణ ప్రభుత్వం 500కోట్ల రూపాయిలను స్థిరీకరణ నిధిని సమకూర్చింది. ఇంకోపక్క తెలంగాణలో 10,733 రెవిన్యూ గ్రామాల్లో సమితుల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఇదేతరహా ప్రయత్నాలు ఆంధ్రాలోనూ జరుగుతున్నాయి. వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీలు రైతు కమిటీలను ఏర్పాటుచేయడం కొత్తేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి అధికారంలో ఉన్నపుడు అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు కర్షక పరిషత్‌ను ఏర్పాటు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక విద్యా కమిటీలు, సాగునీటి సంఘాలకు, రైతు కమిటీలకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ హయాంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 60వేల మంది ఆదర్శ రైతులను నియమించారు. ఒకొక్కరికీ వెయ్యి రూపాయిల గౌరవ వేతనం కూడా ఇచ్చారు. ప్రతి నెలా ఆరు కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విపక్షాలు ధ్వజమెత్తాయి. ఆయా పార్టీలు అధికారంలో ఉన్నంతకాలం ఇలాంటి కమిటీలను పోషించడంవల్ల తిరిగి అధికారంలోకి రావడానికి ఈ కమిటీలు చాలా దోహదం చేశాయనే అపవాదు కూడా ఉంది. టిఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి దోహదం చేస్తాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం రైతు కమిటీలను వేస్తోందనే ఆరోపణలు లేకపోలేదు. దీనికి కారణం ప్రతి సీజనులో రైతుకు 4వేల రూపాయిలు అందించాలని నిర్ణయించడమే. ఈ మేరకు 39వ నెంబర్ జీవో కూడా ఇచ్చింది. రైతు సమన్వయ సమితులను ప్రభుత్వం నియమిస్తే తాము రైతు సంరక్షణ సమితులను నియమిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అల్టిమేటం ఇచ్చింది. రైతు సమితులు రాజకీయాలకు దారితీస్తాయా? కొంతమంది ప్రముఖులు ఏమంటున్నారో ఈనాటి ఫోకస్‌లో తెలుసుకుందాం.