ఫోకస్

రాజకీయ జోక్యం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరుగాలం నేలతల్లినే నమ్ముకునే రైతుల విషయంలో రాజకీయ జోక్యం సరికాదు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే స్థానిక రాజకీయాలు రైతులపై ప్రభావాన్ని చూపుతున్నాయి. రైతు సంఘాలు రాజకీయాలకు వేదికలు కావడం మంచి పద్ధతి కాదు. రైతుకు భరోసా ఇచ్చే విషయంలో ప్రభుత్వాలు మరింత సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఉత్తరాది రైతులతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ రైతుల్లో చైతన్యం తక్కువనే చెప్పాలి. పూర్తిగా వర్షాధారంపై ఆధారపడే రైతు, అదృష్టాన్ని నమ్ముకుని మాత్రమే వ్యవసాయం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పూర్తి అభద్రతాభావంతో ఉన్న రైతుకు భరోసా కల్పించాల్సి ఉంది. నూతన వ్యవసాయ విధానాలతోపాటు యాంత్రీకరణపై అవగాహన కల్పించాలి. సాంకేతికతను జోడించి వ్యవసాయం చేయడంద్వారా ఉత్పత్తితోపాటు నాణ్యత పెరిగేలా శిక్షణనివ్వాలి. రైతు పండించిన పంటను మార్కెటింగ్ చేసే బాధ్యతను ప్రభుత్వాలే తీసుకోవాలి. వారు పండించిన పంటను భద్రపరచుకునేందుకు కోల్డ్‌స్టోరేజ్‌లు నిర్మించాలి. అలాగే వ్యవసాయంతో పాటు అనుబంధ శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలి. ఉద్యానవనాలు, పశుసంవర్ధకంతోపాటు మార్కెటింగ్ వంటి శాఖలు వ్యవసాయ శాఖకు అనుబంధంగా పనిచేస్తే, సమన్వయం పెరిగి వ్యవసాయం లాభసాటిగా మారేందుకు ఆస్కారం ఉంటుంది. వ్యవసాయానికి ప్రధాన వనరు నీరు. సాగునీటి సదుపాయం కల్పిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. కొంతకాలంగా నదుల అనుసంధానంపై చర్చ జరుగుతోంది. అయితే, అదృష్టవశాత్తు రాష్ట్రంలో నదుల అనుసంధాన ప్రక్రియ ఇప్పటికే మొదలై వాటి ఫలాలను అందిస్తోంది. పట్టిసీమ అనుసంధానం ద్వారా కృష్ణా డెల్టాకు నీరందుతోంది. పురుషోత్తపట్నంద్వారా ఉత్తరాంధ్రకు సాగునీటి వసతి లభిస్తుంది. తద్వారా రైతుకు మేలు చేకూరుతుంది. అయితే, దీన్ని కూడా కొన్ని వర్గాలు రాజకీయం చేయడం సరైన విధానం కాదు.
- కెఎస్‌ఎన్ రాజు,
ఎమ్మెల్యే, చోడవవరం, విశాఖ జిల్లా