ఫోకస్

రాజకీయ ప్రయోజనాలేవీ లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏళ్లతరబడిగా భూవివాదాలతో సతమతం అవుతున్న రైతులకు మేలు చేసుందుకు ప్రభుత్వం రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, సమగ్ర భూసర్వే నిర్వహిస్తోంది. భూములపై రైతులకు అధికారిక హక్కుల లేకపోవటం, పట్టాదారు పాసు పుస్తకాలు తదితర అవకాశాలు లేకపోవటంతో రుణాలు అందటం గగనంగా మారింది. ఒకరి భూములు మరొకరికి అమ్మినా అవి రికార్డులలో నమోదు కాకపోవటంతో రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. రికార్డులలో అసలు భూయజమానికి బదులు ఇతరుల పేర్లు నమోదు చేసిన సంఘటనలు గ్రామాలలో కోకొల్లలు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి రైతు సమన్వయ సమితులు ఉపయోగకారిగా ఉంటాయి. రైతు సమన్వయ సమితుల కారణంగా గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత తగ్గుతుందనే ప్రతిపక్షాల ఆరోపణ సరికాదు. రెవెన్యూ యంత్రాంగానికి, రైతులకు మధ్య సమన్వయ సమితులు సంధానకర్తలుగా ఉంటారే తప్ప, వీరికి పెద్దగా బాధ్యతలు ఉండవని ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేసిన తరువాత ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం ఎందుకు? ఇప్పటికే రైతుల వద్ద ఉన్న రికార్డులు సరిగాలేక రుణాలకోసం బ్యాంకుల చుట్టు చెప్పులు అరిగేలా తిరగవలసి వస్తోంది. గతంలో కర్షక పరిషత్ పేరిట, కాంగ్రెస్ హయాంలో ఆదర్శ రైతుల పేరిట జరిపిన రాజకీయ నియామకాలు ప్రజలు మరచిపోలేదు. భూముల విషయంలో బినామీల వ్యవహారాలు బయటపడతాయనే కారణంగానే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నట్లు అనుమానించవలసి వస్తోంది. రైతు సమన్వయ సమితులు రైతుల ప్రయోజనాలు కాపాడటానికే తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం కాదు.
- పసునూరి దయాకర్
టిఆర్‌ఎస్ ఎంపీ