ఫోకస్

జీవన ప్రమాణాలు పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతుల జీవన ప్రమాణాలు పెరిగితే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకోసం ప్రవేశపెట్టిన పథకాలు రాష్టస్థ్రాయిలో కిందివరకు అందడం లేదు. క్షేత్రస్థాయికి అందేలా చర్యలు తీసుకోవాలి, ఇందుకు ప్రణాళికాబద్ధమైన ప్రణాళికలు రూపొందించాలి. భారతదేశంలో వ్యవసాయరంగ అభివృద్ధికి స్వామినాథన్ సిఫార్సులను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఏ మూలకు తీసుకెళ్లయినా అమ్ముకునే విధంగా చర్యలు తీసుకుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 500 మార్కెట్ యార్డులను ఈనాం పథకం కింద అనుసంధానం చేయడం జరిగింది. దీనివల్ల రైతులు తమ పంటకు ఎక్కడ గిట్టుబాటు ధర లభిస్తే అక్కడ అమ్ముకునే వీలుందని, విదేశాలకు సైతం ఎగుమతులు చేసుకోవచ్చు. చెక్ పోస్టుల్లో కూడా అనుమతులు కల్పించడం జరిగింది. తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు, తక్కువ ప్రీమియంతో పంటల బీమా, సర్వే నెంబర్ల ప్రకారం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. భూముల సారాన్ని పరీక్షించి సాయిల్ హెల్త్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతోంది. ఇప్పటికి 5 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. సేంద్రీయ ఎరువులను సబ్సిడీపై అందించడం, కిసాన్ టీవీ చానల్, కిసాన్ రేడియో వంటి ఏర్పాట్లు చేసి వ్యవసాయ సలహాలు అందిస్తున్నారు. రైతుల ఆదాయం పెరిగినపుడే దేశ జిడిపి పెరుగుతుంది. దేశాభివృద్ధి సాధ్యపడుతుంది. ఉద్యాన పంటలను, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. క్రిషిల్ ఇండియా పథకంద్వారా పప్పు్ధన్యాల ఉత్పత్తి పెంచడం వల్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. అదే విధంగా తృణధాన్యాల ఉత్పత్తి పెంచుతున్నారు. వినియోగాన్ని కూడా పెంచుతున్నారు. అన్ని పథకాలు రైతులకు అందినపుడే సమగ్రాభివృద్ధి సాధ్యం.
- సోము వీర్రాజు
ఎమ్మెల్సీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు