ఫోకస్

ప్రగతి సాధనకే సమితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతాంగ ప్రగతి కోసమే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం రైతు సమన్వయ సమితిల వ్యవస్థ ప్రవేశపెట్టింది. రైతాంగం సమస్యలపై ప్రభుత్వానికి, రైతులకు సలహాలు, సూఛనలందించడంలో రైతు సమితిలు వారధిగా పనిచేస్తాయ. ప్రభుత్వం రైతులకు అందించే పథకాల అమలులో రైతు సమితిలు సలహాలిస్తాయ. ముఖ్యంగా ప్రభుత్వం అందించబోయే పంట పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించడంలో, క్రాప్ పాలసీ నిర్ణయించడంలో, పండించిన పంటలకు మద్ధతు ధర ఇప్పించడంలో, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు అందించడంలో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతుసమితిలు తమ స్థాయిలో సలహా వ్యవస్థగా పనిచేస్తాయ. కెసిఆర్ ప్రభుత్వం దేశంలోనే చారిత్రాత్మకంగా రైతు సమన్వయ సమితిల వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా వ్యవసాయ రంగంలో, భూరికార్డుల ఆధునీకరణలో విప్లవాత్మక సంస్కరణలకు కృషి చేస్తున్నారు. మార్కెటింగ్ పరిస్థితులపై అవగాహాన లోపంతో వేస్తే అంతా పత్తి లేదా కంది అన్నట్లుగా ఒకే పంట వేస్తుండటంతో గిట్టుబాటు ధర సమస్య తల్తెత్తుతోంది. ఈ రకమైన సమస్యలను దూరం చేసేందుకు ఏ పంట వేస్తే గిట్టుబాటు ధర వస్తుందన్న విషయమై రైతులకు రైతు సమితిలు సలహాలిస్తాయ. మార్కెట్‌లో సరైన మద్ధతు ధర అందని సందర్భాల్లో రైతుల పంటను గోదాంల్లో నిల్వ చేసి మద్ధతు ధర అందించడంలోనూ రైతు సమితిలు చొరవ తీసుకుంటాయ. రైతు సమితిలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ రాజకీయ రాద్ధాంతాలే. భూ పట్టాదారులైన రైతులనే రైతు సమితిల్లో సభ్యులుగా తీసుకున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఆదర్శ రైతులుగా రైతులు కానివారిని తీసుకోవడంతో వ్యవస్థ ఆశించిన మేలు జరుగలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన రైతు సమితిల్లో రైతులనే సభ్యులుగా ఎంపిక చేయడం జరిగింది. కాంగ్రెస్ హాయంలో వేసిన ఇందిరమ్మ కమిటీల మాదిరిగా, ఏపిలో ఇటీవల వేసిన జన్మభూమి కమిటీల మాదిరిగా రైతు సమితిలు గ్రామపంచాయతీలకు సమాంతరమైన లేక ప్రత్యామ్నాయ కమిటీలు ఎంతమాత్రం కాదు. రైతు సమితిల వ్యవస్థ స్వతహాగా నిర్ణయాలు తీసుకోబోదు.. హరిత విప్లవ లక్ష్యాల సాధనకు సలహాలిచ్చే వ్యవస్థగానే పనిచేస్తుంది. పంటల సాగుతోపాటు పాడి రైతుల సంక్షేమానికి, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రగతికి రైతు సమితిలు చేయూతనందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
- గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్లగొండ ఎంపి, టిఆర్‌ఎస్