ఫోకస్

ఆదాయ వనరుగా చూడటం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూడటం లేదు. అయితే కల్తీ మద్యాన్ని నివారించడంతోపాటు మద్యం మాఫియాను అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. నాటుసారా తయారీదార్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నకిలీ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. నూతన మద్యం పాలసీద్వారా చాలా మార్పులు వచ్చాయి. మద్యం దుకాణాల కేటాయింపు పారదర్శకంగా జరిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో తమ అధినేత చంద్రబాబు బెల్ట్‌షాపులను దశలవారీగా అరికడతామని ప్రకటించారు. ఆ హామీ మేరకు గ్రామాల్లో ఇప్పటికే సంబంధిత అధికారులు చర్యలు ప్రారంభించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమించి మద్యం అమ్మకాలు జరిపితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఎమ్పార్పీకే విక్రయించేందుకు మద్యం వ్యాపారులు ముందుకు రావాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయాలు జరిగేలా ఎక్సైజ్ శాఖ నిఘా ఉంచాలి. న్యాయస్థానం ఆదేశాలను కూడా విధిగా పాటించాలి. మహిళలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో విక్రయాలు సాగాలి. గుడి, బడి వంటి ప్రదేశాలకు దూరంగా దుకాణాలు ఏర్పాటుచేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయినప్పటికీ ప్రభుత్వం మద్యం ఆదాయంపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలపైనే దృష్టి పెట్టింది. మద్యం విక్రయాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే యోచన తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదు.
-తోట నరసింహం, లోక్‌సభలో టిడిపి పక్ష నేత