ఫోకస్

ఆదాయం పదింతలు పెరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన తర్వాత మద్యం ఆదాయాన్ని పదింతలు పెంచుకున్నది. మద్యం ప్రియులను పూర్తిగా మద్యానికి బానిసలుగా చేసి, ప్రజలను మాయ మాటలతో, లేనిపోని, ఆచరణ సాధ్యం కానీ హామీలతో బురిడీ కొట్టిస్తూ పబ్బం గడుపుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ప్రజలు మద్యం వైపు మొగ్గు చూపకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా, మరింత ప్రోత్సహించడం దురదృష్టకరం. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అందుబాటులోకి తీసుకుని రావడం దురదృష్టకరం. అంటే ప్రజలను ఉదయం 9 గంటల నుంచే అంటే అల్పాహరం నుంచే ప్రారంభించమని ప్రభుత్వ ఉద్ధేశ్యమా?. గత ప్రభుత్వ హయాంలో 10 గంటలకు మద్యం దుకాణాలు, బార్లు తెరిస్తే, ఈ ప్రభుత్వం మధ్యాహ్నం తర్వాతే తెరిచేలా, ప్రజలకు తక్కువ సమయం దుకాణాలు, బార్లు అందుబాటులో ఉండేలా చేసి ఉంటే ప్రజల బాగోగులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్లు భావించేందుకు అవకాశం ఉండేది. కానీ ప్రభుత్వం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రులు, పాఠశాలల కంటే ఎక్కువ సంఖ్యలో మద్యం దుకాణాలు, బార్లు ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఆబిడ్స్ నుంచి ఎల్‌బి నగర్ వరకు 29 బార్లు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ మద్యం విక్రయాల్లో నెంబర్-1గా ఉంది. ఇంకా ప్రోత్సహించి బంగారు తెలంగాణగా కాకుండా మద్యం తెలంగాణగా మారుస్తారేమో!.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మద్యపాన నిషేధం విధించడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత పాటించినా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే నిషేధాన్ని ఎత్తివేసి, బెల్ట్‌షాపులను ప్రోత్సహించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత చివరకు మద్యం దుకాణాలకూ పర్మిట్ రూంలు ఇవ్వడం సిగ్గు చేటు. మద్యం దుకాణంలో ఖరీదు చేసి, పక్కనే పర్మిట్ రూంలో తాగేసి మద్యం మత్తులో ఉంటే, కమీషన్లు, అక్రమాలతో గడిపేయవచ్చని పాలకులు భావిస్తున్నారేమో. కానీ ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోవు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన మేము (కాంగ్రెస్) సహించం. ప్రభుత్వ చర్యను ప్రజల్లో ఎండగడతాం అని హెచ్చరిస్తున్నాం.
- మహ్మద్ షబ్బీర్ అలీ ప్రతిపక్ష నేత, తెలంగాణ శాసనమండలి