ఫోకస్

ప్రజల్లో చైతన్యం కలిగిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రం మద్యరహితంగా ఉండాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఇది ఎకాఎకిన జరిగేది కాదని అందరికీ తెలుసు. తెలంగాణను మద్య రహిత రాష్ట్రంగా మార్చేందుకు శాస్ర్తియ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించాం. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు మద్యం వల్ల వచ్చే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం. 2017-19 ఎక్సైజ్ విధానంలో ఇదే ప్రధాన అంశంగా ఉంటుంది. మద్యానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రచారం చేస్తాం. ఈ అంశంపై ప్రజల్లో చైతన్యం రావలసి ఉంది. ఇందుకోసం మా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటోంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సంకల్పించాం. వివిధ ప్రచార సాధనాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తాం.
గతంలో ప్రభుత్వమే సారా తయారు చేసి విక్రయించేది. మా వైఖరి ఇందుకు భిన్నంగా ఉంటుంది. సారా తయారీని, అమ్మకాలను మేము పూర్తిగా నియంత్రించాం. సారా లేని రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని రూపుదిద్దుతున్నాం. గతంలో సారా వ్యాపారంలో ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తున్నాం. ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు, చిన్నతరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు నెలకొల్పుకునే వారికి ఆర్థికంగా చేయూత ఇస్తున్నాం. ఇందుకోసం ఎంత ఖర్చయినా వెనుకాడబోమని ముఖ్యమంత్రి కెసిఆర్ పదే పదే ప్రకటించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. ఇప్పటికే అనేకమంది సారా వ్యాపారాన్ని నిలిపివేసి ఇతర వ్యాపకాలు చేపట్టి హాయిగా జీవిస్తున్నారు. మా ప్రభుత్వం తీసుకున్న మద్యరహిత రాష్ట్ర తయారీలో ఇది విప్లవాత్మక చర్యగా అభివర్ణించవచ్చు. సారా రహిత రాష్ట్రంగా మార్చడంలో ప్రజల సహకారం కూడా అవసరమే. ఇప్పటికే 99 శాతం సారా తయారీ నిలిచిపోయింది. ఎక్సైజ్ సిబ్బంది అన్నిప్రాంతాలపై డేగకన్ను వేసి, సారా తయారు కాకుండా, విక్రయాలు జరగకుండా నిరంతరం శ్రమిస్తున్నారు.
ఎక్సైజ్ ఆదాయం ఎంత అన్నది మాకు ముఖ్యం కాదు. అందుకే 2017-19 ఎక్సైజ్ సంవత్సరంలో కూడా మద్యం దుకాణాలను పెంచలేదు. ఇప్పటి వరకు ఉన్న 2216 రిటైల్ దుకాణాలే యథాతదంగా కొనసాగిస్తాం. గతంలోలేని విధంగా ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయించాం. ప్రతి రిటైల్ దుకాణం వద్ద సిసి కెమెరాలను పెట్టి, ఎక్సైజ్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ రూం నుండి నిరంతరం పర్యవేక్షించాలని నిర్ణయించాం. అక్రమాలకు, అవకతవకలకు అవకాశం లేకుండా చూడటమే మా ప్రభుత్వ ఉద్దేశం. ఎక్సైజ్ ఆదాయం లేకుండానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించేందుకు ఏర్పాట్లు చేశాం. ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచుకుంటున్నామని విపక్షాలు చేసే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. గతంలోలాగా ప్రభుత్వం చెప్పేది ఒకటి.. చేసేది మరొకటిలా మా పరిపాలన ఉండదు. మేం ఏది చెబుతామో, దానే్న అమలు చేస్తాం.
- టి. పద్మారావు, ఎక్సైజ్ శాఖ మంత్రి, తెలంగాణ.