ఫోకస్

మద్యం వల్లే ప్రభుత్వం నడవటంలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వానికి మద్యం ఒక్కటే ఆదాయ వనరుకాదు. గత మూడేళ్లుగా పరిస్థితి చూస్తే రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఎక్సైజ్ ఆదాయంతోనే ప్రభుత్వం నడవటంలేదు. గతంలో 15 నుంచి 25 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరేది. అదీ ఉమ్మడి రాష్ట్రంలో.. ఇప్పుడు ఆ పరిస్థితులులేవు. సిండికేట్ల కారణంగా కొన్నిచోట్ల మద్యం వేలం ప్రక్రియకు విఘాతం కలుగుతోంది. ప్రభుత్వం నేరుగా మద్యం దుకాణాలు నిర్వహించే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. మద్యంపై వచ్చే ఆదాయం కంటే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలి. వైన్‌షాపుల వేలంతో బెల్ట్ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం బెల్ట్‌షాపుల నియంత్రణకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి ఎన్‌టిఆర్ హయాంలో మద్యనిషేధం విధించారు. దానివల్ల ఆర్థిక సంక్షోభం ఎదురు కాలేదు కానీ మాఫియా విజృంభించింది. సిండికేట్లలో గతంలో రాజకీయ జోక్యం ఉండేది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పలువురు నాయకులే భాగస్వాములుగా ఉండేవారు. ఇప్పుడు వ్యాపారం పూర్తిగా తగ్గింది. మాఫియాలో రాజకీయ జోక్యంలేదు. అధికారంలోకి వచ్చినప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లిక్కర్ సిండికేట్ల వ్యవహారంలో తలదూర్చే నేతలను మందలించారు. దశలవారీ మద్యనిషేధం తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మకాలపై నియంత్రణ పెరిగింది. ఆదాయం తగ్గినా సామాజిక శ్రేయస్సు దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాల అనే్వషణ జరుగుతోంది. గుడి, బడికి 100, 150 మీటర్ల నియమ నిబంధనలతో పాటు ఆవాసాల మధ్యలో బార్లు, వైన్‌షాపుల ఏర్పాటును ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి రద్దుచేసింది. ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు జరగాలని నిర్దేశించింది. నియంత్రణ వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గే మాట వాస్తవమే. మద్యం, మైనింగ్‌లే ఆదాయానికి కీలకమైనప్పటికీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని అమలుచేస్తోంది. సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా ఆదాయాన్ని వృద్ధి చేసుకుంటే మద్యంతో పనిలేదు. ఒకే విడత మద్యనిషేధం అమలుచేస్తే ఇతర రాష్ట్రాల లిక్కర్ (ఎన్‌డిపి) దొడ్డిదారిన ప్రవేశించే వీలుంది. దీనికంటే దశలవారీ వైన్‌షాపులు, బార్లు, బెల్ట్ షాపులు నియంత్రణ ద్వారా ఓ వైపు ప్రత్యామ్నాయం ఆలోచిస్తూ మరోవైపు పూర్తిస్థాయి నిషేధం దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉంది.
- నక్కా ఆనంద్‌బాబు
ఏపీ గిరిజన, సాంఘిక సంక్షేమశాఖామాత్యులు