ఫోకస్

మద్యాన్ని నిషేధించలేమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్యం అమ్మకాలు రాకెట్‌లా దూసుకుపోతున్నాయి. కాలంతో పనిలేకుండా అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇది ప్రభుత్వాలకు ఉపశమనం కలిగించే విషయమే అయినా ప్రజలకు మాత్రం తీరని నష్టాన్ని కలిగిస్తోంది. ప్రతిరోజూ సగటున తెలంగాణలో 50కోట్లు, ఆంధ్రాలో 45కోట్ల రూపాయల అమ్మకాలు జరుగుతున్నాయి. అంటే తెలంగాణలో 18వేల కోట్లు, ఆంధ్రాలో 17వేల కోట్ల రూపాయిల వరకూ అమ్మకాలు జరుగుతున్నాయి. కేవలం మద్యం దుకాణాల రిజిస్ట్రేషన్ ద్వారానే దాదాపు 400 కోట్ల రూపాయలు తెలంగాణకు సమకూరాయి. ప్రభుత్వానికి ఇదో పెద్ద వనరుగా తయారైంది. మద్యం అమ్మకాలపై స్వచ్ఛ భారత్ సెస్, విద్యా సెస్ కొనసాగుతున్నాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆర్థిక మద్దతు ఇస్తోంది. మద్యం అమ్మకాల ఆదాయం మాట దేవుడెరుగు, దానిని తాగుతున్న వారి పరిస్థితి దయనీయం. తీవ్రమైన అనారోగ్యానికి గురై వేలకోట్ల రూపాయిలను ఆస్పత్రుల పాల్చేస్తున్నారు. పూర్తి మద్య నిషేధం విధించి విఫలమైన తర్వాత దానిని పాక్షికంగా సడలించినా, తర్వాత విచ్చలవిడి అమ్మకాలు పెరిగాయి. అధికారికంగా నిషేధించినా లెక్కలేనన్ని బెల్టు షాప్‌లు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నడుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ ఏడాది మద్యం అమ్మకాలకు కొత్త పాలసీ వచ్చింది. దీంతో ఆదాయం మరింత పెరిగే వీలుంది. ప్రతిరోజు మద్యం తాగేవారిలోనే కాదు, అపుడపుడూ తాగేవారికీ అనారోగ్య సమస్యలకు కొదవలేదు. తాగిన వెంటనే అనారోగ్యానికి గురికాకపోయినా, వినియోగం పెరిగేకొద్దీ దాని దుష్ప్రభావాలు తీవ్రంగానే ఉంటున్నాయి. అదికాస్తా కొన్నాళ్లకు అలవాటుగా మారి ప్రాణాల మీదకే ముంచుకొస్తుంది. ఒకపుడు అనైతికం అనుకున్న మద్యం వాడకం నేడు నాగరికతకు చిహ్నంగా భావిస్తున్నారు. చాటుమాటున తాగిన వారు ఇపుడు బహిరంగంగా వేడుకలా మారిపోయింది. మంచి జరిగినా, చెడు జరిగినా, ఉల్లాసంగా ఉన్నా, నిరుత్సాహంగా ఉన్నా మద్యం సేవించడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. మద్యపానం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని అందరికీ తెలిసినా, దానిని మానలేకపోతున్నారు. కొంతమంది దీనికి ఒత్తిడి ఒక కారణంగా చెబుతున్నారు. మద్యపానంతో సామాజిక సంబంధాలు సైతం మృగ్యమైపోతున్నాయి. నేరాలు పెరుగుతున్నాయి, రోడ్డు ప్రమాదాలు పెచ్చుమీరుతున్నాయి. విపక్షంలో ఉన్నంత కాలం మద్య నిషేధంకోసం పోరాటాలు ఉద్యమాలు చేసిన పార్టీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పక్కన పెట్టడం అనుభవమే. కనీసం పాక్షిక నిషేధం విధించాలని, మద్యం అమ్మకాలపై నియంత్రణ ఉండాలని చేస్తున్న విజ్ఞప్తులు చెవిటివాని ముందు శంఖం ఊదినట్టే మారాయి. ఈ క్రమంలో మద్యం అమ్మకాలు, నిషేధంపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.