ఫోకస్

ప్రభుత్వమే సమాధానం చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికార పార్టీ చెప్పినట్లే అధికారులు వినాలనే విధంగా బహిరంగ ఆదేశాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలి. కలెక్టర్ల సమావేశంలో తమ పార్టీ నేతలను పరిగణనలోకి తీసుకొని నిధుల విడుదల, సంక్షేమ పథకాల అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆదేశించడం రాజ్యాంగానికే విరుద్ధం. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులను కాదంటూ రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా అధికార పార్టీ నేతలతో ప్రత్యేక కమిటీలు వేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావించడం, దానికి అనుగుణంగా అధికారులు పనిచేయడం విచారకరం. కొంత మంది నీతి నిజాయితీ కలిగిన అధికారులు తాము చేస్తున్నది తప్పని తెలిసి కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు అలవాటు పడినవారు మాత్రం అధికార పార్టీ నేతల మాటలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. వీరంతా భవిష్యత్తులో ఇబ్బందులు పడక తప్పదు. నీరు-చెట్టు, హౌసింగ్, రైతు రథం వంటి సంక్షేమ పథకాల అమలులో ప్రజాప్రతినిధులు కాని వారి మాటలకు విలువనిస్తూ అధికారులు తప్పు చేస్తున్నారు. తాము నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నామని వారికి తెలిసికూడా పొరపాట్లు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఉన్న ప్రాంతాల్లో అధికారులు ప్రజల ఆమోదం పొందని కొందరు అధికార పార్టీ నేతల మాటలకు తలొగ్గి పనిచేస్తుండడం బాధాకరం. తాము చేసిన తప్పులకు అధికారులు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దని మనవి చేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తయింది, మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో అధికారుల్లో ఇకనైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నాం.
- మేకపాటి గౌతమ్‌రెడ్డి, వైకాపా ఎమ్మెల్యే, ఆత్మకూరు