ఫోకస్

లక్ష్మణ రేఖ దాటొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పోటీతత్వంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో పనిచేయాలి. అంతేకాని రాజ్యాంగపరమైన లక్ష్మణరేఖ దాటి వ్యవహరిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు కలెక్టర్‌పైన, కలెక్టర్ ఎమ్మెల్యేపైన అభియోగాలు మోపారు. ఇది నిజంగా దురదృష్టకరమైన పరిణామం. ఆ ఎమ్మెల్యే ప్రజలకు సంబంధించి వ్యవహారంపై మాట్లాడారనేందుకు ప్రాతిపదిక లేదు. కలెక్టర్ కూడా ఎమ్మెల్యేపై తీవ్రమైన అభియోగాలు చేశారు. ఇక్కడ అధికార వ్యవస్థలో ఉన్నవారిలో ఉన్న ‘ఇగో’వల్ల పరిస్థితి దిగజారింది. వీరు ప్రజలకు సంబంధించిన పనులపై పోటీపడలేదు. చాలాసార్లు అధికారులు ప్రభుత్వం ఏమి చెబితే అది చేస్తారు. అది ప్రజల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలైనందున అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇతర పార్టీల నేతలు ఒక్కోసారి ఆవేశపడుతుంటారు. కాని అధికార పార్టీ ఎమ్మెల్యేలే అధికారులతో, జిల్లా అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలకు దిగితే విలువేమంటుంది? ఇటీవలి కాలంలో రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్ల మధ్య పరస్పర విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి హాని కలిగించే పరిణామాలు. ఇటువంటివి పునరావృతం కాకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు సంయమనంతో ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఘర్షణకు తావులేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు పని చేయాలి. అందులో లోపాలుంటే ప్రతిపక్ష పార్టీ నేతలు ఉద్యమిస్తారు. ఇక్కడ సీను రివర్స్ అయింది. అధికార పార్టీ నేతలే రోడ్డెక్కితే, ఇక ప్రజాస్వామ్య విలువలకు పాతరేసినట్లే.
- కె శివకుమార్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వైకాపా శాఖ