ఫోకస్

ఓటు హక్కు వినియోగించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌కు మంచి ప్రతినిధులను ఎన్నుకుని, స్వయం పరిపాలనకు శ్రీకారం చుట్టాల్సిన అవకాశం హైదరాబాద్‌లోని ప్రతి పౌరునికీ లభించింది. జిహెచ్‌ఎంసి ఎన్నికలు దేశానికి ఆదర్శంగా నిలిచేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమకున్న ఓటు హక్కును వినియోగించుకుని, మంచి ప్రతినిధిని ఎన్నుకోవడం వల్ల సుపరిపాలన సాధ్యమవుతుంది. నీతివంతమైన పరిపాలనకు సంబంధించి ప్రజలు కేవలం చర్చలకు, మాటలకు పరిమితం కాకూడదు. సమాజం బాగోగుల గురించి మాట్లాడేవారు, నాయకుల అవినీతి గురించి మాట్లాడేవారు ఎన్నికలను ఒక ఆయుధంగా మార్చుకోవాలి. గ్రామ పంచాయితీ ఎన్నికలతో మొదలుకుని జిహెచ్‌ఎంసి ఎన్నికల వరకు స్థానిక సంస్థలకు జరిగే ఏ ఎన్నికలైనా కీలకమైనవే. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. వాస్తవంగా ఈ ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగినప్పటికీ, ఇప్పటికైనా జరుగుతున్నందు వల్ల ఓటర్లు తమకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అవినీతి గురించి మాట్లాడే ముందు ప్రతి ఒక్కరూ తాము ఎంత బాధ్యతతో ప్రవర్తిస్తున్నారో ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైనంది. ఈ పర్యాయం ఓటింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. వివిధ కాలనీల సంఘాల ప్రతినిధులు, విద్యా సంస్థలు, అభిమాన సంఘాలు, కార్పొరేట్ సంస్థలు, సంక్షేమ సంఘాలు తదితరులతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చర్చిస్తున్నాం. ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని వారికి వివరించి, ప్రతి ఇంట్లో నమోదైన ఓటర్లు తప్పకుండా తమ ఓటును వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున పూర్తి ఏర్పాట్లు చేశాం. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నాం. 150 వార్డులకు జరిగే ఎన్నికలకోసం 7500 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. 42 వేల మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నారు. హైదరాబాద్ విభిన్న సంస్కృతీ సాంప్రదాయాలకు నెలవుగా ఉంది. వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ రాష్ట్రాల నుండి వచ్చినవారు ఇక్కడ జీవిస్తున్నారు. నిబంధనల మేరకు అర్హులైన అందరికీ ఓటు హక్కు ఉంది. ఈ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి 2న నిర్వహించే పోలింగ్ కేంద్రాలకు రావాలని కోరుతున్నాను. పోలింగ్‌లో రికార్డు సృష్టించాలన్నదే నా తాపత్రయం. రెండోతేదీన ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై ఐదు గంటల వరకు కొనసాగుతుంది.
పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండాలి. అభ్యర్థులు ఎన్నికల వ్యయాన్ని ఐదు లక్షల రూపాయలకు మించకుండా చూసుకోవాలి. పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రవర్తన, వ్యయం తదితర అంశాలను పరిశీలించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ఈ అంశాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే మాకు ఫిర్యాదు చేయవచ్చు. డబ్బు ప్రమేయం లేని ఎన్నికలు నిర్వహించేందుకు మేము చేస్తున్న ప్రయత్నానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను.

- వి. నాగిరెడ్డి, కమిషనర్, రాష్ట్ర ఎన్నికల సంఘం, తెలంగాణ