ఫోకస్

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోనల్ వ్యవస్థ విషయంలో విద్యావంతుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. జోనల్ వ్యవస్థ అమలు చేస్తే కలిగే లాభ నష్టాలపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రెండు జోన్లు మాత్రమే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి మాత్రమే ఉంటాయని గతంలో చంద్రశేఖర్ రావు స్వయంగా ప్రకటించారు. మరికొన్ని జోన్లు ఏర్పాటు చేస్తామని ఇటీవల ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్టప్రతి ఉత్తర్వులను సవరించాలని అంటున్నారు. అయితే కొత్త జిల్లాల ప్రాతిపదికన ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మరోవైపు చెబుతున్నారు. ఎలా సాధ్యమవుతుందో వివరణ ఇవ్వలేకపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా వదిలేసి, ఉద్యోగ నియామకాల కోసం రాష్ట్రాన్ని ఆనాడు ఆరు జోన్లుగా విభజించారు. ఈ విభజన రాష్టప్రతి ఉత్తర్వులు ప్రకారమే జరిగాయి. ప్రభుత్వం నియామకాలన్నీ రాష్టప్రతి ఉత్తర్వులకు లోబడి చేపట్టాలని డిమాండ్ చేశారు. దానివల్ల ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, తెలంగాణ వారికి తీరని అన్యాయం జరిగింది. రాష్టప్రతి ఉత్తర్వులు ఉన్నా, వాటిని అమలు చేయకుండా కొత్త మార్గాలు వెతికారు. రాష్టప్రతి ఉత్తర్వుల పరిధిలో కాకుండా కొత్త వ్యవస్థను సృష్టించి, వారికి అనుగుణంగా నియామకాలు, పదోన్నతులు, పోస్టింగులు ఇచ్చుకున్నారు. తెలంగాణలో అలా జరగడానికి వీలు లేదని ఘంటాపథంగా చెప్పారు. కానీ, రాష్ట్ర స్వరూపం మారిన తర్వాత ఏ జిల్లా ఏ జోన్ కింద వస్తుందో ఇంతవరకు నిర్థారించలేదు. 10 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో 31 జిల్లాలు చేశారు. కేవలం రెండు జోన్లు ఉంటే బాగుండేది. ఒక రాష్ట్ర స్థాయి జోన్, రెండోవది జిల్లా స్థాయి జోన్. ఈ రెండు జోన్లు ఉంటే జిల్లాల్లోని స్థానిక నిరుద్యోగులకే ఉద్యోగాలు లభించేందుకు అవకాశం ఉండేది. జోనల్ సమస్యలు పరిష్కరించినప్పటికీ ఏ జిల్లాను ఏ జోన్ కిందకు తేవాలి, ఏ పోస్టు ఏ క్యాడర్ కిందకు వస్తుందో తేలుస్తారో ప్రభుత్వానికి స్పష్టత లేదు. జిల్లా, రాష్ట్ర స్థాయి జోన్లు ఉంటే వచ్చిన క్యాడర్‌ను సునాయసంగా చేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ప్రభుత్వ నియమాకాల్లో గ్రూపు-1, గ్రూపు-2 పోస్టులను రాష్ట్ర స్థాయి పోస్టులుగా చూడాలి. మిగతా పోస్టులన్నీ జిల్లా స్థాయి పోస్టులుగా గుర్తించి రెండు జోన్ల ప్రాతిపదికన నియామకాలు చేపట్టినట్లయితే జిల్లాల వారీగా స్థానికులకు ఉద్యోగవకాశాలు లభిస్తాయి. దీనికి రాష్టప్రతి ఉత్తర్వులు అడ్డంకిగా మారే అవకాశం లేదు. ఇలా ఆలోచించకుండా జోనల్ వ్యవస్థను తీసేస్తాం, జోనల్ సంఖ్యను పెంచుతాం అని కెసిఆర్ ప్రకటిస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
- కనుకుల జనార్థన్ రెడ్డి
మాజీ ఎమ్మెల్సీ, టి.కాంగ్రెస్ సేవాదళ్, చైర్మన్