ఫోకస్

ఆర్థిక అసమానతలు తొలగేవరకు జోన్ల విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్థిక అసమానతలు తొలగేవరకు జోన్ల విధానం కొనసాగాలి. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కొత్తగా జిల్లాలు ఏర్పడటంతో అక్కడ జోన్ల విధానం సంక్లిష్టంగా మారింది. అందువల్లనే తెలంగాణ ప్రభుత్వం జోన్ల విధానం అవసరం లేదని చెబుతోంది. కాగా, ఆంధ్రలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి. గతంలో వెనుకబడిన ప్రాంతాల అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల విషయంలో అన్యాయం జరుగుతుందని జోన్ల విధానం ప్రవేశపెట్టారు. జోన్ల విధానం లేనపుడు కేవలం హైదరాబాద్‌కు చెందిన అభ్యర్థులకే ఎక్కువ అవకాశాలు లభించేవి. అందువల్లనే అప్పట్లో జోన్ల విధానాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణ విడిపోయాక జోన్ల విధానం విషయంలో గందరగోళం నెలకొంది. ఇపుడు అక్కడ స్టేట్, జిల్లా కేడర్ ఉంటే సరిపోతాయంటున్నారు. ఆంధ్రలో నాలుగు జోన్లు నిర్వహిస్తే బాగుంటుందని అంటున్నారు. ఇదిలా ఉండగా కేంద్రం ఇప్పటికీ తెలంగాణాలో పాత 10 జిల్లాలను గుర్తిస్తోంది. ఇపుడు జోన్ల విధానం అక్కరలేదంటే దానిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జోన్లు అవసరమా, కాదా అన్న విషయమై కేంద్రానికి నివేదిక అందజేయాలి. ఇటీవల మెడికల్ సీట్ల విషయంలో చాలా గొడవ జరిగింది. అభివృద్ధి చెందిన జిల్లాలు వెళ్లి రాయలసీమలో తిష్టవేశాయి. అందువల్లనే ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగేవరకు జోన్ల విధానం కొనసాగించడమే మేలు.
- బండారు రామ్మోహనరావు
కన్వీనర్, ఎపి, తెలంగాణ లోక్‌సత్తా ఉద్యమ సంస్థ