ఫోకస్

జోనల్ విధానం అవసరమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉద్యోగుల నియామకాలు, బదిలీల ప్రక్రియలో జోనల్ విధానం ఉండాల్సిందే. స్థానికత ప్రామాణికంగా జరిగే క్లాస్ 4, జూనియర్ అసిస్టెంట్ నియామకాల్లో స్థానిక కోటా జిల్లాలకే పరిమితం. బదిలీలు కూడా జిల్లా పరిధిలోనే జరుగుతాయి. అలాగే సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్‌లకు జరిగే బదిలీల్లో జోన్ కీలకం. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జోన్లలో బదిలీలు, నియామకాలకు సంబంధించి జోన్‌ల ప్రభావం ఉంటుంది. సీనియర్ గెజిటెడ్ అధికారుల విషయంలో బదిలీలు రాష్ట్రం ప్రామాణికంగా ఉంటాయి. జోనల్ వ్యవస్థవల్ల ప్రస్తుతం క్లాస్ 4, జూనియర్ అసిస్టెంట్లకు ఎంతో మేలు చేకూరుతోంది. జోనల్ వ్యవస్థవల్ల కింది స్థాయి ఉద్యోగులు వారి సొంత ప్రాంతాలకే పరిమితమవుతారు. తద్వారా బదిలీల్లో వీరు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్కో ప్రభుత్వ శాఖలో ఒక్కో విధంగా జోనల్ విధానం అమలవుతోంది. రెవెన్యూ, మెడికల్ విభాగాల్లో కొంతమేర వ్యత్యాసం ఉంది. స్థానికత ఆధారంగా జరిగే నియామకాలవల్ల కొంతమేర ప్రతికూలత కూడా ఉందనే చెప్పాలి. రాష్ట్ర విభజన నేపథ్యంలో సెక్రటేరియట్ తదితర రాష్టస్థ్రాయి సంస్థలు, శాఖల్లో ఉద్యోగుల విభజనే అందుకు ఉదాహరణగా చెప్పాలి. అప్పట్లో హైదరాబాద్ కేంద్రంగా రాజధాని ఉండగా, స్థానిక కోటాలో ఉద్యోగాల భర్తీ జరిగింది. విభజన సందర్భంగా కేంద్ర నిబంధనల మేరకు ఉద్యోగుల పంపిణీలో క్లాస్ 4, జూనియర్ అసిస్టెంట్లను విభజించారు. వీరిలో అత్యధికులు తెలంగాణ ప్రాంతానికే చెందినవారు ఉండటంతో ఇప్పుడు పరిస్థితులు తలనెప్పిగా పరిణమించాయి. ఇది కేవలం విభజన వల్ల ఎదురైన పరిణామమే. ఇక గడచిన మూడు దశాబ్దాలుగా ప్రభుత్వం ఎపిపిఎస్సీ ద్వారా పూర్తిస్థాయిలో ఉద్యోగాల భర్తీ చేపట్టలేదు. కేవలం కొన్ని కీలక పోస్టులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల బ్యాక్‌ల్యాగ్ పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగ నియామకాలు, బదిలీల్లో జోనల్ వ్యవస్థ ఉండటం మేలనే చెప్పాలి.
-కె ఈశ్వరరావు, అధ్యక్షుడు, విశాఖ జిల్లా ఎన్‌జిఓ అసోసియేషన్