ఫోకస్

జోన్ల వ్యవస్థపై స్పష్టత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో జోన్ల ఏర్పాటుపై ప్రభుత్వానికి స్పష్టత లేదు. ఓసారి జోన్ల రద్దంటూ.. మరోసారి జోన్లు అవసరమంటూ ప్రకటన చేస్తున్న ప్రభుత్వం అసలు జోన్లపై స్పష్టత ఇవ్వాలి. నిరుద్యోగ సమస్య తీర్చేందుకు జోన్ల వ్యవస్థను రద్దు చేస్తున్నాం. జోన్ల రద్దుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ప్రకటించడం, మళ్లీ జోన్ల వ్యవస్థను పటిష్టపరుస్తామంటున్న పాలకవర్గం నిరుద్యోగులను అయోమయానికి గురిచేస్తోంది. పరస్పర విరుద్ధ ప్రకటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం జోన్ల వ్యవస్థను ప్రవేశపెడితే అసమానతలు తావులేకుండా కొత్త జోన్లు ఏర్పాటుచేయాలి. జోన్ల వ్యవస్థ కొనసాగితే కొంత మేరకు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాల యువతకు, నగర ప్రాంతాల యువత నుంచి రక్షణ ఉంటుంది. జోన్ల సంఖ్యను పెంచేటప్పుడు గ్రామీణ, మారుమూల ప్రాంత విద్యావంతులైన నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలి. జోన్ల వ్యవస్ధను రద్దు చేస్తామని, రాష్టమ్రంతా ఒకేజోన్ ఉంటే బాగుంటుందని కెసిఆర్ తొలుత ప్రతిపాదించారు. దీనివల్ల ఉద్యోగుల పదోన్నతులకు ఇబ్బందులు ఎదురవుతాయని గ్రహించారు. రాష్టమ్రంతా ఒకే జోన్ ఉంటే గ్రామీణ ప్రాంతంలోని బిసి, గిరిజన, మైనార్టీ, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు తీవ్రంగా నష్టపోతాయి. కాబట్టి కొత్తగా ఏర్పాటు చేయనున్న జోన్లలో అసమానతలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉంది.
-జగన్‌మోహన్ మెట్ల, లోక్‌సత్తా, తెలంగాణ ఉపాధ్యక్షుడు