ఫోకస్

సమన్యాయం కోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో కేవలం రెండు జోన్లు మాత్రమే ఉన్నాయి. కొత్తగా 21జిల్లాల ఏర్పాటుతో జోన్ల సంఖ్య పెంచడం ద్వారా వివిధ జిల్లాల మధ్య ఉద్యోగ కేటాయింపులు, భర్తీలో అన్యాయం జరుగకుండా ఉండేందుకు జోన్ల సంఖ్యను పెంచాల్సివుంది. జోన్ల సంఖ్య పెంపు, రాష్టప్రతి ఉత్తర్వులు 371డి అధికరణ సవరణలతో ఉద్యోగాల నియామకాలు, పదోన్నతులు, పోస్టింగుల్లో వివాదాలు నివారిస్తే అందరికి సమన్యాయం జరుగుతుంది. ఇప్పటికే పాత జోనల్ వ్యవస్థ విధానంతో వైద్య ఆరోగ్య శాఖతోపాటు ఇతర శాఖల ఉద్యోగ నియామకాల్లో ఆలస్యమైంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య వసతులు మెరుగుపరిచినా తగిన వైద్యులను, సిబ్బందిని నియమించడంలో జోనల్ విధానంలో తలెత్తిన వివాదం ఆటంకంగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్త జిల్లాల ప్రతిపాదికనే జోనల్ వ్యవస్థను పరిగణలోకి తీసుకుని ఉద్యోగాల నియామకాలు జరిపించాలని ఆదేశించి వివిధ శాఖల్లో ఉద్యోగ భర్తీ ప్రక్రియ ముందుకుసాగేలా చేశారు. అలాగే భవిష్యత్‌లో వివాదాలు తలెత్తకుండా జోనల్ వ్యవస్థపై, కేడర్ల సంఖ్యపై అధ్యయనానికి మంత్రులు, ఉన్నతాధికారులతో కమిటీ వేయడం ద్వారా అన్ని జిల్లాల వారికి సమన్యాయం ఉండేలా కృషి చేస్తున్నారు. ఎంపీగా తాను తెలంగాణ రాష్ట్రంలో రాష్టప్రతి ఉత్తర్వులు 371డి సవరణకు ఢిల్లీ స్థాయిలో ముందుకుతీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. స్థానికతపై మరింత శాస్ర్తియమైన విధానంతోపాటు ఏయే జోన్‌లో, ఏయే కేడర్‌లో ఏ జిల్లాలు, ఏ పోస్టులు వస్తాయన్నదానిపై సమగ్ర విధానం తీసుకురావాలి. పరిపాలన సౌలభ్యంకోసం నాలుగు కేడర్లు ఉండాలని మంత్రులు చెబుతున్నారు. న్యాయపరంగా చిక్కులు లేకుండా అందరికీ సమన్యాయం జరిగే శాస్ర్తియమైన జోనల్ సిస్టమ్‌ను, ఉద్యోగ నియామక ప్రక్రియను తాను కోరుతున్నాను. రాష్ట్రం మొత్తం యూనిట్‌గా ఉద్యోగ భర్తీ చేపడితే గ్రామీణ నిరుద్యోగులకు అన్యాయం జరుగవచ్చు. చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలతో పరిపాలన ప్రజలకు చేరువైందనడానికి తెలంగాణ, కొత్త జిల్లాల ఏర్పాటునే నిదర్శనం. విద్య, వైద్యం, శాంతిభద్రతలపై పట్టు పెరిగింది. గతంలో ఎస్పీ స్థాయి అధికారిని కలవాలంటే వందల కిలోమీటర్లు పయనించి తీరా అందుబాటులో లేకపోతే మళ్లీ వెళ్లాల్సివచ్చేది. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లాస్థాయి అధికారులు ప్రజలకు దగ్గరై సులభంగా అందుబాటులో ఉండి పథకాల అమలులో, ప్రజాసమస్యల పరిష్కారంలో వేగం పెరిగింది. అందుకే కొత్త జిల్లాలకు అనుగుణంగా, పరిపాలన ప్రజలకు చేరువగా ఉండేలా అందరికీ సమ న్యాయం జరిగేలా జోనల్ వ్యవస్థను పటిష్టం చేసి, జోన్ల సంఖ్యను పెంచి కేడర్ల సంఖ్యను పక్కాగా లోటుపాట్లు లేకుండా రూపొందించాలని కోరుకుంటున్నాను.
- బూర నర్సయ్యగౌడ్
భువనగిరి ఎంపి (టిఆర్‌ఎస్)