ఫోకస్

త్వరలోనే నివేదిక ఇస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రంలో జోనల్ వ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి ఏర్పాటుచేసిన కమిటీలో నేను కూడా ఒక సభ్యుడినే. కమిటీ వేగంగా అధ్యయనం చేసి ఈ అంశంపై సమగ్ర నివేదికను రూపొందించేందుకు ప్రయత్నిస్తాం. జోనల్ వ్యవస్థ ఉద్యోగులతో ముడిపడి ఉంది. మా ప్రభుత్వం పరిపాలనా అవసరాలకోసం 10 జిల్లాలను విభజించి 31 జిల్లాలను ఏర్పాటు చేసింది. కెసిఆర్ నేతృత్వంలో ఎలాంటి పనులు చేసినా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకునే చేస్తుందన్న పేరు వచ్చింది. సమాజ అభివృద్ధి, ప్రజా క్షేమమే మా ప్రధాన ఉద్దేశం. సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండగా ఏర్పడ్డ జోనల్ వ్యవస్థ వల్ల తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలేదు. జోనల్ వ్యవస్థ ఏర్పాటైనప్పటికీ, తెలంగాణ యువతకు సరైన ఉద్యోగాలు లభించలేదు. ఏదో ఒక పేరుతో ఇతరులే ఉద్యోగాలను కబళించేశారు. అందుకే తెలంగాణ ఏర్పాటు తర్వాత జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని అనుకున్నాం. అయితే ఈ వ్యవస్థ రద్దువల్ల సాంకేతికంగా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే జోనల్ వ్యవస్థను కొనసాగించాలని, ఇప్పుడున్న రెండు జోన్ల స్థానంలో మరికొన్ని జోన్లను అదనంగా చేర్చాలని భావిస్తున్నాం. 31 జిల్లాలను ఎన్ని జోన్ల పరిధిలోకి తేవాలన్న అంశంపై విస్తృతంగా చర్చిస్తాం. ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ బాధ్యతాయుతంగా, శాస్ర్తియంగా అధ్యయనం చేస్తుంది. ఎలాంటి అవకతవలకు ఆస్కారం లేకుండా చూస్తాం. సమగ్ర నివేదిక రూపొందించే ముందే ఉద్యోగులతో చర్చలు జరపుతాం. ప్రజల అభిప్రాయం కూడా సేకరిస్తాం. ఉద్యోగాల భర్తీకి సంబంధించి జిల్లాస్థాయి, జోనల్ స్థాయి, మల్టీజోనల్ స్థాయి, రాష్టస్థ్రాయి ఉద్యోగులు.. ఇలా నాలుగు భాగాలుగా విభజిస్తాం. ఏ ఉద్యోగాలు, ఏ క్యాడర్‌లో చేర్చాలో పరిశీలించి నిర్ణయిస్తాం. హడావుడిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోదలచుకోలేదు. విమర్శలకు అవకాశం లేకుండా సమగ్ర నివేదికను రూపొందిస్తాం. ఇప్పటివరకు మా ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు శాస్ర్తియ పద్ధతిలో ఉన్నాయి. అదేవిధంగా జోనల్ వ్యవస్థపై కూడా శాస్ర్తియ విధానం అమలు చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ప్రజాస్వామ్య విధానంలో అందరి అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశమే లేదు. మంత్రివర్గ బృందానికి అందరి సహాయ, సహకారాలు కావాలి.
- పోచారం శ్రీనివాసరెడ్డి
వ్యవసాయ మంత్రి, తెలంగాణ