ఫోకస్

తక్షణం పెంచాల్సిన ఆవశ్యకత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి రాష్ట్రం నుంచి కొనసాగుతున్న నాలుగు జోన్లు నేటికీ యథావిధిగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన వలన తెలంగాణకు రెండు జోన్లు మిగలటం ఆపై జిల్లాల సంఖ్య రెట్టింపు కావటంతో ఉద్యోగుల నియామకాల కోసం అక్కడ తక్షణం జోన్లు పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు ఒక జోన్‌గా, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు రెండవ జోన్‌గా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మూడవ జోన్‌గా, రాయలసీమలోని నాలుగు జిల్లాలు నాలుగవ జోన్‌గా కొనసాగుతున్నాయి. అయితే పెరిగిన జనాభా దృష్ట్యా తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా జిల్లాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉన్నది. బిజెపి మొదటినుంచి ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంక్షోభం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వంలో దీనిపై ఎలాంటి కదలిక కనిపించటంలేదు. వాస్తవానికి గుంటూరు, తూర్పు గోదావరి, అనంతపురం, కర్నూలు అతి పెద్ద జిల్లాలుగా ఉన్నాయి. ప్రజలు ప్రతి చిన్న పనికోసం సుదూర ప్రాంతాల్లోని కలెక్టర్ కార్యాలయాలకు రావాల్సి వస్తోంది. అలాగే ఒక కలెక్టరే కాకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కూడా పూర్తిస్థాయిలో జిల్లా అంతటా పర్యవేక్షణ జరపలేక పోతున్నారు. దీని వలన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ఉద్యోగాలకాశాలు గణనీయంగా పెరుగుతాయి. అలాగే ప్రభుత్వ సేవలు మారుమూల గ్రామాల ప్రజలకు సహితం చక్కగా అందుతాయి.
- పరుచూరి అశోక్‌బాబు. ఏపి ఎన్జీవో సంఘం అధ్యక్షుడు