ఫోకస్

స్థానికులకే ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్టప్రతి ఉత్తర్వులు 371-డి ప్రకారం దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, జమ్మూకాశ్మీర్‌లోనూ జోనల్ విధానం అమలులో ఉండేది. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఇపుడు జోనల్ విధానం మూడు రాష్ట్రాల్లో అమలులో ఉంది. అప్పట్లో రెండు రాష్ట్రాల్లో కలిపి ఆరు జోన్లు ఉండేవి. ప్రస్తుతం ఆంధ్రాలో నాలుగు జోన్లు, తెలంగాణలో రెండు జోన్లు ఉన్నాయి. తెలంగాణలో తొలుత సింగిల్ జోన్‌తో రిక్రూట్‌మెంట్‌లు నిర్వహించాలనే యోచన వచ్చినా జిల్లాల సంఖ్య పెరగడంతో జోన్ల సంఖ్యను మరింతగా పెంచాలనే భావనకు ప్రభుత్వం వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు జోన్ల విధానం ప్రస్తుత అవసరాలకు సరిపోవడంతో అక్కడి ప్రభుత్వం జోన్లను పెంచే ఆలోచన ఏదీ చేయకున్నా, తెలంగాణలో జోన్ల అంశం వివాదంగా మారింది. జోనల్ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా వెనక్కు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న జోన్ల సంఖ్యను పెంచేందుకు వీలుగా రాష్టప్రతి కొత్తగా ఉత్తర్వులు జారీ చేయమంటూ కోరాలని ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన రాష్టప్రతి ఉత్తర్వులు (371-డి) ని సవరించాల్సిన అవసరం తెలంగాణలో ఉంది. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ అవసరాలకు అనుగుణంగా రాష్టప్రతి ఉత్తర్వులను కొత్తగా జారీ చేయాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు కేంద్రానికి పంపిస్తామని సిఎం కెసిఆర్ చెబుతున్నారు. పరిపాలనా సౌలభ్యంకోసం తెలంగాణలో కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటు చేశామని, దాంతో మొత్తం 31 జిల్లాలు ఏర్పాటు కావడంతో కొత్త జోన్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో రెండు జోన్లు మాత్రమే ఉన్నాయి, 31 జిల్లాలకు ఇవి సరిపోవన్న నిర్ణయానికి వచ్చారు. జిల్లా, జోనల్, మల్లీజోనల్, స్టేట్ క్యాడర్ పోస్టులను కొనసాగించాలని నిర్ణయిస్తూ, ఏ పోస్టులు ఏ క్యాడర్‌లో ఉండాలో నిర్ధారించాల్సి ఉందని నిర్ణయించారు.
కొత్త జోన్లను ఏర్పాటు చేస్తే, ఏయే జిల్లాలు ఏయే జోన్ల పరిధిలో ఉండాలో అధ్యయనం చేసేందుకు మంత్రులు, అధికారులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చేసే సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై తీర్మానం చేయాలని నిర్ణయించారు. కొత్త జోన్లకు సంబంధించి ప్రభుత్వం సమగ్రంగా ఒక నివేదిక రూపొందించి కేంద్రానికి పంపించనుంది. ప్రభుత్వం చేసే ఉద్యోగ నియామకాలన్నీ రాష్టప్రతి ఉత్తర్వులకు అనుగుణంగానే జరిగేలా చూడాల్సి ఉంటుంది. విద్యుత్తు, సింగరేణి, ఆర్‌టిసి తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలను రాష్టప్రతి ఉత్తర్వుల పరిధిలోకి తీసుకురావాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ పోస్టు ఏ క్యాడర్‌లో ఉండాలో నిర్ణయించేందుకు స్పష్టత తీసుకురావాల్సి ఉంటుంది. శాస్ర్తియ విధానంలో నిర్ణయం తీసుకునేందుకు కలెక్టర్లతోనూ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చిస్తే సమస్య పరిష్కారమవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ స్థానికతకు సంబంధించి స్పష్టత ఇవ్వగా, తెలంగాణలో సైతం స్థానికతను నిర్ణయించే అంశంపై సమగ్రంగా చర్చ జరపాలని నిర్ణయించారు. విద్యార్థి చదువుకున్న స్థానాన్ని అనుసరించి స్థానికత నిర్ణయించడం సబబు కాదని, ఈ విధానంలో మార్పులు, చేర్పులు తెచ్చేందుకు కమిటీ అధ్యయనం చేసి సిఫార్సులు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ అంశం కొంత మంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.