ఫోకస్

అవినీతిపరులను అనర్హులుగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినీతికి పాల్పడే వారు ప్రజాప్రతినిధులైనా..అధికారులైనా ప్రజల విశ్వాసం కోల్పోవలసిందే. ప్రజాప్రతినిధులైతే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలి. అధికారులైతే కఠిన చర్యలు తీసుకోవాలి. పాలనాపరమైన లొసుగులే అవినీతిని ప్రోత్సహిస్తాయి. అవినీతికి పాల్పడే ప్రజాప్రతినిధులు, అధికారులను చెడగొడతారు. ప్రజాప్రతినిధిగా గెలిచిన వారు తమ ఆధిపత్యం కోసం అధికారులను అడ్డుపెట్టుకుంటారు. అధికారులు తమ మెప్పుకోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు. ఎన్నికల్లో గెలవాలంటే ఖర్చుతో కూడుకున్న పని, పెట్టిన ఖర్చును ఎలా తీయాలి అని గెలిచిన వాళ్లు అక్రమ వ్యవహారానికి అలవాటు పడతారు. అధికారంలో ఉన్న పార్టీ తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రజాప్రతినిధులను తమ గుప్పిట పెట్టుకుంటారు. ఇదే సాకుగా అధికారులు సైతం ప్రజాప్రతినిధులకు జై కొడుతూ, అవినీతికి అలవాటుపడిపోతారు. ప్రజాప్రతినిధులు నిస్వార్థంగా, నీతినిజాయితీతో పనిచేసే రోజులు పోయాయి. అదేబాటలో అధికారులు నడుస్తున్నారు. అవినీతికి ప్రధాన కారణం చట్టలొసుగులు, సంస్కరణలే కారణం. లంచం తీసుకోకుండా, అవినీతికి పాల్పడకుండా సంస్కరణలు చేపట్టాలి. కఠిన నిర్ణయాలతో సంస్కరణలు అమలు చేయాలి. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో అవినీతి విధానాలకు పాల్పడకుండా కేంద్రం కఠినంగా వ్యవహరించాలి. పార్టీల్లో సంస్కరణలు, జవాబుదారితనం పెరిగేలా చట్టసభల్లో మార్పు తేవాలి. ఖర్చులపై సాలీనా బ్యాలెన్స్ షీటును ఇవ్వాలన్న నిబంధన ఉన్నా అంత సీరియస్‌గా అమలు జరగడం లేదు. అదేవిధంగా అధికారులు ఉద్యోగంలో చేరకముందు, చేరిన తరువాత ఆస్తుల వివరాలు తెలపాలి. ప్రజాప్రతినిధులు గానీ..అధికారులు గానీ తమతమ ఆస్తుల వివరాలు సాలీనా ప్రభుత్వానికి తెలియజేయాలి. అప్పుడే వారివారి అవినీతి, అక్రమార్జన బయటపడుతుంది.
-పాండురంగారావు
లోక్‌సత్తా, తెలంగాణ అధ్యక్షుడు