ఫోకస్

ప్రజల్లో మార్పురావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజలు ఏదేని పనికోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేటపుడు లంచం ఇస్తేగాని పనులు జరగవు అనే మనస్తత్వంలో ఉన్నారు. దానినుంచి ముందు బయటపడాలి. లంచం ఇవ్వడానికి స్వస్తి పలికినపుడే దీనిని కొంత మేరకైనా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అధికారులు అవినీతికి పాల్పడుతున్నప్పుడు అడపాదడపా ఎసిబి అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండటం, లంచం తీసుకునేటపుడు దాడులు చేసి వారిని పట్టుకోవడం జరుగుతోంది. అయినప్పటికీ లంచాలకు అలవాటుపడ్డ అధికారులు దానినుంచి బయటపడటం లేదు. అలాంటపుడు అవినీతిని పూర్తి స్థాయిలో అరికట్టాలంటే ప్రజలు లంచం ఇవ్వడానికి స్వస్తి పలకాలి. అలాగే ఎవరేని అధికారులు లంచం అడిగితే ముఖ్యమంత్రి టోల్ ఫ్రీ 1100 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఎసిబిని ఆశ్రయించవచ్చు. ప్రభుత్వం కూడా అవినీతిని అరికట్టేందుకు అనేక కొత్త మార్గాలను ప్రవేశపెట్టింది. అయితే ఆచరణలో మాత్రం వెనుకంజలో ఉంది. ప్రజలు కూడా అడిగిందే తడవుగా లంచం ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే తమ పని జరగదు అనే పరిస్థితి నుంచి ప్రజలు బయటపడకపోతే ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రయోజనం ఉండదు. ఇక ప్రజాప్రతినిధుల్లో కూడా కొంతమంది అవినీతికి పాల్పడుతున్న సందర్భాలున్నాయి. ఎవరికి వారు అవినీతికి దూరంగా ఉండాలన్న నియమాన్ని పెట్టుకుంటేతప్ప ఈ పరిస్థితిలో మార్పు సాధించలేము. ప్రజాప్రతినిధులు, వారి దగ్గర తిరిగే కొంతమంది నాయకులు కూడా కొన్నిచోట్ల లంచాలను గుంజుతున్నారు. ఏది ఏమైనప్పటికీ అధికార వ్యవస్థలోగాని, ప్రజాప్రతినిధులు ఎవరు లంచం తీసుకున్న ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. అందువల్ల లంచాలకు అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు దూరంగా ఉన్నప్పుడే ప్రజలకు మంచి పరిపాలన అందించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పథకాల అమల్లో అవకతవకలు లేకుండా ఉండేందుకు, పారదర్శకతకు అనేక కొత్త పద్ధతులను అవలంభిస్తోంది. పూర్తిస్థాయిలో నిరోధించాలంటే లంచం ఇవ్వడానికి ప్రజలు స్వస్తి పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- మీసాల గీత
ఆంధ్రప్రదేశ్ స్ర్తి శిశు సంక్షేమ
శాసనసభ కమిటీ చైర్మన్