ఫోకస్

అక్రమార్జన సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాసంక్షేమంకోసం అధికారులు పారదర్శకంగా వ్యవహరించి ప్రభుత్వం అందించే ఫలాలు ప్రజలకు సక్రమంగా చేరవేయడంలో అధికారులు వారధిగా నిలువాలి. అధికారం చేతుల్లో ఉంది కదా అని ప్రజాసొమ్మును అక్రమంగా ఆర్జిస్తే అందుకు తగినమూల్యం చెల్లించుకున్నవారు ప్రపంచంలో అనేకమంది ఉన్నారు. అధికారంలోకి రాకముందు తన కొడుకు, కూతురు అవినీతికి పాల్పడినా సహించబోనని ముఖ్యమంత్రి శపథం చేసారు. లంచం అనే వ్యవస్థ రాచరిక వ్యవస్థ నుండి నేటివరకు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. కౌటిల్యుడిగా పేరుగాంచిన చాణక్యుడు అనుసరించిన బాటలో సిఎం కెసిఆర్ యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్నారు. సిఎం కెసిఆర్ అధికారుల అవినీతి భాగోతాన్ని బయటపెట్టడానికి ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటు చేయడమే కాకుండా నేరుగా ఎసిబి అధికారులకు సమాచారం అందించాలని 1064 టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ప్రకటించారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది కుటుంబాలకు సరిపడా వేతనాన్ని 43 శాతం ఫిట్‌మెంట్‌ను కల్పించారు. లంచం తీసుకోవడం ఎంత నేరమో ఇవ్వడం కూడా అంతే నేరమనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించినప్పుడే వ్యవస్థలో మార్పు కనిపిస్తుంది. స్వప్రయోజనాల కోసం అధికారులను తప్పుదారి పట్టించడం సమంజసం కాదు. ఉన్నత చదువులు చదువుకుని విజ్ఞానంతో అధికారంలోకి వచ్చి అజ్ఞానంగా వ్యవహరించే వారిలో మార్పు తీసుకువచ్చేందుకు కృషిచేయాలే కానీ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయడం పొరపాటు. ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా అవినీతి పట్టికలుండవని, స్వప్రయోజనాలకోసం ఒకరు, స్వార్థచింతన మరొకరి ద్వారా వ్యక్తమై మొత్తం సమాజానికే మచ్చ తీసుకువస్తోంది. చట్టం ఎవరికీ చుట్టం కాదని, దాని పని అది చేస్తుందన్న నీతిని ప్రతి అధికారి గుర్తిస్తే సమాజంలో పెనుమార్పు రావడం తథ్యం. కొత్త రాష్ట్రంలో కొత్త తరహాలో కొనసాగుతున్న సుపరిపాలన ద్వారా అవినీతి తిమింగలాల ఆటకట్టిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కడం, యావత్ భారతదేశానికే స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
- చింతా ప్రభాకర్
సంగారెడ్డి ఎమ్మెల్యే, తెలంగాణ