ఫోకస్

కఠిన చర్యలతోనే అదుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జనకు పాల్పడితే ప్రభుత్వం కఠిన చర్యలకు వెనుకాడబోదు. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు పరిపాలనా దక్షత, పారదర్శకమైన పాలనను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తెలుగుదేశానికి ఓట్లు వేసి పట్టం కట్టారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు సారథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతోంది. ముఖ్యమంత్రి అవినీతికి వ్యతిరేకంగా, నీతివంతమైన పాలన జరిగేలా పాటుపడుతున్నారు. ఇటీవలి కాలంలో కొందరు అధికారులు అక్రమార్జన కేసుల్లో ఇరుక్కోవడం, కొందరు ప్రజాప్రతినిధులపై అవినీతి ఆరోపణలు రావడం వలన ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమాదం ఉంది. ఇటువంటి చర్యల వలన నిజాయితీతో పనిచేసే ప్రజాప్రతినిధులు, అధికారులకు చెడ్డపేరు వస్తుంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు కృషి జరుగుతోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు నిస్వార్థంగా కృషిచేసిననాడే ప్రభుత్వ హామీలను అమలుచేసేందుకు మార్గం సుగమం అవుతుంది. అవినీతి రహిత పాలన సాధ్యమవుతుంది. అక్రమార్జనకు పాల్పడే అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని ఎప్పటికైనా చట్టానికి లొంగిపోవల్సిందే. అక్రమార్కులను ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. అవినీతి రహిత పాలన అందించేందుకు కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి గత మూడున్నర సంవత్సరాల్లో పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సేవకు పునరంకితం కావాలి.
- తోట నరసింహం
కాకినాడ ఎంపి
లోక్‌సభలో టిడిపి పక్ష నేత