ఫోకస్

ఉన్నతస్థాయిలో అవినీతి నశించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యథారాజా తథాప్రజా... రాజు అక్రమాలకు పాల్పడితే అతని కింద ఉన్న పరివారమంతా అక్రమాలకు పాల్పడుతుంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మనం ప్రజాస్వామ్య యుగంలో ఉన్నాం. కేంద్రంలో పార్లమెంట్, రాష్ట్రాల్లో అసెంబ్లీలు పనిచేస్తున్నాయి. చట్టసభలే ప్రజలకు దిశానిర్దేశనం చేస్తుంటాయి. వివిధ సమస్యలపై చర్చించి ప్రజలకు అవసరమైన చట్టాలను రూపొందించడం, ఇప్పటికే అమల్లో ఉన్న చట్టాలలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలంటే చట్టసభల్లో చర్చించి మార్పులు చేయడం సహజంగా జరుగుతుంది. అంటే చట్టసభలు, వీటిలో సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులు చట్టానికి లోబడి ఉండాలి. చట్టమన్నా, రాజ్యాంగమైనా గౌరవం ఉండాలి. నీతిగా, పాలకులు ధర్మంగా, న్యాయంగా ఉండాలని ప్రజలంతా ఆశిస్తారు. పాలనలో ఉండే కీలక వ్యక్తులు అవినీతికి పాల్పడుతూ ఉంటే, కిందిస్థాయి వారు కూడా అవినీతికి పాల్పడటం సహజంగా జరుగుతుంది. రాజకీయ అవినీతిపై ఎప్పుడైనా ఆందోళన జరిగినా, మీడియాలో బహుళ ప్రచారం జరిగినా ప్రభుత్వం చేసే పని ఒక్కటే. అవినీతికి పాల్పడ్డవారిపై విచారణ చేయిస్తామని, కఠినంగా శిక్షిస్తామని ప్రకటిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో కమిషన్లు వేస్తారు. విచారణ నామమాత్రంగానే సాగుతుంది. విచారణ కమిషన్‌కు మొదట విపరీత ప్రచారం ఇస్తారు. ఆ తర్వాత కమిషన్ ఇచ్చే నివేదికను బుట్టదాఖలు చేస్తారు. అవినీతి అధికారులకు కూడా పాలకులే కొమ్ముకాస్తుంటారు. అప్పుడప్పుడు ప్రజల ఆలోననను, దృష్టిని మళ్లించేందుకు కొంతమంది అధికారులపై ఎసిబి చేత దాడులు చేయిస్తారు. ఎసిబి దాడుల తర్వత కొంతకాలానికి విచారణ మూలనపడుతుంది. సదరు అవినీతి అధికారికి మళ్లీ పోస్టింగ్ ఇస్తుంటారు. ఇప్పటివరకు పాలకులపైకాని, అధికారులపై కాని కఠినంగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇక్కడ మతం, కులం, భాష తదితర అంశాల కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఫలానా కులం వాడైనందువల్ల పాలకులు ఇక్కట్లకు గురిచేస్తున్నారని, ఫలానా మతం వాడైనందున ఇబ్బందుల పాలు చేస్తున్నారంటూ సదరు కులం, మతానికి చెందిన కొంతమంది ఆందోళనలు చేస్తుంటారు. నిజం చెప్పాలంటే అవినీతికి పాల్పడ్డవారే ఆందోళనలు చేయిస్తుంటారు. నీతివంతమైన పాలన కావాలంటే తొలుత రాజు ఆదర్శంగా పాలన చేయాలి. అందరికీ ఆదర్శంగా నిలవాలి. ఉన్నత స్థాయిలో అవినీతి ఆగితే, కిందిస్థాయిలో అవినీతికి అవకాశం ఉండదు. అవినీతి గురించి మాట్లాడే కంటే ఆచరణలో చూపాల్సిన అవసరం ఉంది. అవినీతి ఏ రూపంలో ఉన్నా దాన్ని రూపుమాపాల్సిందే!
- డాక్టర్ కె. నారాయణ
సిపిఐ జాతీయ నాయకుడు