ఫోకస్

చట్టానికి పదును పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినీతిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలకు పదును పెట్టాలి. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో ముందు లేకపోయినా, అవినీతిలో ముందున్నది. అవినీతి జాడ్యం అనేది అనాదిగా వస్తున్నది. దీనిని సంపూర్ణంగా రూపుమాపాలంటే వ్యవస్థలో మార్పు రావాలి. అంటే ప్రజలే తొలుత చైతన్యవంతులై అవినీతిని పారదోలేందుకు కృషిచేయాలి. లంచావతారం ఎత్తే అవినీతి అధికారుల భరతం పట్టాలి. అంటే వారిని తొలుత ప్రోత్సహించరాదు. తమ పని ముందుగా చేసేసుకుందామన్న భావనతో లంచం ఇవ్వడం ప్రారంభిస్తే, అది ఆగదు. దానికి ఆశపడే అధికారులు, ఉద్యోగులు నిత్యం అదేపనిగా అవినీతికి పాల్పడతారు. అయితే మొత్తం అధికారులను, ఉద్యోగులను తప్పుపట్టాల్సిన పనిలేదు. కొందరు నిజాయితీపరులూ ఉన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, అవినీతికి పాల్పడేవారు కొంతమంది మాత్రమే ఉంటారు. అటువంటి వారిని సమూలంగా నిర్మూలించాల్సిందే. ఎవరైనా లంచం తీసుకుంటూ పట్టుబడితే, తాత్కాలికంగా సస్పెన్షన్‌కు గురై, ఆ తర్వాత పైరవీతోనో, మరో రూపంగానో ఉద్యోగంలో తిరిగి చేరుతున్నారు. ఒకసారి పట్టుబడితే సస్పెన్షన్ కాకుండా పూర్తిగా డిస్మిస్ చేసేలా చట్టంలో మార్పుతేవాలి. పట్టుబడిన అధికారి లేదా ఉద్యోగి ఆస్తులను ప్రభుత్వానికి అటాచ్ చేసేలా చట్టానికి పదును పెట్టాలి. లంచావతారులు ఈ మధ్య కాలంలో విజృంభిస్తున్నారు. ఒక ఎస్‌ఐ రెండు వందల కోట్లకు ఎలా పడగలెత్తగలిగాడు, మరో టౌన్ ప్లానింగ్ అధికారి 300 కోట్లు ఎలా సంపాదించగలిగాడు, ఇంకా ఇటీవల పట్టుబడిన సబ్-రిజిస్ట్రార్ల సంపాదనలు వింటే అవినీతి ఎలా పెచ్చుపెరిగిపోయిందో స్పష్టమవుతోంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి. ఇంకా నామినేషన్ పద్ధతుల్లో కోట్లాది రూపాయల పనులను కార్యకర్తలకు అప్పగించే చర్యలు మానుకోవాలి. ఇక ప్రజాప్రతినిధుల అవినీతి విషయానికి వస్తే ఒకసారి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేదా మరో ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే చాలు తరతరాలుగా తమ కుటుంబ సభ్యులు తిన్నా తరగని ఆస్థి సంపాదించాలన్న ఆశతో కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు ఎన్నికల్లో 5 కోట్లు ఖర్చు చేస్తే 50 కోట్ల రూపాయలు సంపాదించాలన్న లక్ష్యం పెట్టుకుంటున్నారు. ధన రాజకీయాలు ఎక్కువయ్యాయి. దీనికి ఫులిస్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. దీంతోపాటే భూకబ్జాలనూ నిరోధించాల్సిన అవసరం ఉంది. ఇటీవల సింగరేణి సంస్థ కార్మిక సంఘానికి జరిగిన ఎన్నికలు మరింత షాక్‌కు గురిచేసేలా ఉన్నాయి. కొంతమంది ఉత్సాహవంతులైన అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు వెండి ప్లేట్లు, గ్లాసులు, నగదు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. కాబట్టి రాజకీయాల్లో ధన ప్రభావం తగ్గేలా కేంద్ర ఎన్నికల కమిషన్ (సిఇసి) చర్యలు తీసుకోవాలి. అందుకు అనుగుణంగా ఎన్నికల సంస్కరణలకూ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ముఖ్యంగా వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడే అన్నీ చక్కబడి, అవినీతి మటుమాయం అవుతుంది.
- పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ, ఎఐసిసి కార్యదర్శి