ఫోకస్

అవినీతి రహిత భారత్ సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో అవినీతి ఈనాటిది కాదు, పరిశ్రమలు ఏర్పాటు మొదలు, చిన్న చిన్న పనులు కాంట్రాక్టులకు ఒక పనిముట్టుగా ఉన్న అవినీతి ఈ రోజు అన్ని రంగాల్లో అన్ని సేవల్లోకి ప్రవేశించింది. ఆఖరుకు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎక్స్‌రే తీయాలన్నా, ఎంఆర్‌ఐ చేయాలన్నా అవినీతి లేనిదే పనిజరగడం లేదు. అవినీతిని కూకటివేళ్లతో తొలగించేందుకు అటు కేంద్రంలో సిబిఐ, రాష్ట్రంలో ఎసిబితోసహా అన్ని శాఖల్లోనూ విజిలెన్స్ విభాగాలు పనిచేస్తున్నాయి. ఎంత పెద్దఎత్తున నిఘా పెరిగినా, అవినీతి కూడా వేళ్లూనుకుంటోందే తప్ప తగ్గడం లేదు. ఒక్కో అవినీతి అధికారి వద్ద వందల కోట్ల రూపాయిల అక్రమార్జన దొరుకుతోంది. ఒకప్పుడు రాజకీయ నాయకులు లోపాయికారిగా అవినీతికి పాల్పడినా, వారి వ్యవహారాలు సైతం బట్టబయలు అవుతున్నాయి. రాజకీయ నాయకులు, అధికారులు కలిసి ఉమ్మడిగా అవినీతికి పాల్పడిన ఘటనలు కూడా అనుభవమే. అవినీతి కారణంగా పేదప్రజల జీవన ప్రమాణాలు మరింతగా దిగజారుతున్నాయి. దారిద్య్రం, వివిధ రంగాల్లో అస్థిరత పెరిగిపోయింది. అంతిమంగా అది వౌలిక వసతుల వైఫల్యానికి, రాజ్య వైఫల్యానికి దారితీస్తోంది. ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు, ఎన్‌జిఓలు, మీడియా, వ్యక్తులు కలిసికట్టుగా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకోవాల్సి ఉంది. అవినీతి వల్ల మావన హక్కుల ఉల్లంఘన, మార్కెట్ అనిశ్చితి, జీవన ప్రమాణాల నాణ్యత క్షీణత చోటుచేసుకుంటున్నాయి. వ్యవస్థీకృత ఆర్థిక నేరాలు పెరుగుతున్నాయి. అవినీతి అరికట్టేందుకు అనేక మార్గాలున్నాయి. సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా అవినీతి నిర్మూలన సగం తగ్గింది. కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం, హక్కుల కమిషన్లను ఆశ్రయించడం, ఇంటర్నెట్, టివి, ప్రింట్ మీడియాకు సమాచారాన్ని ఇవ్వడం, సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరి అవినీతిని నిర్మూలించవచ్చు. అవినీతి నిరోధక సంస్థలు ఏర్పాటు చేయడం, అన్ని అంశాల్లో పారదర్శకతను తీసుకురావడం, నిపుణులకు పదోన్నతులు కల్పించడం, అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడం, వివిధ దేశాలు పరస్పరం సహకరించుకోవడం, అన్ని రంగాల్లో ఆధునిక సంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం లాంటి వాటిద్వారా అవినీతిని కొంతమేరకు తగ్గించవచ్చు. ఎన్నికల రాజకీయాల్లో కూడా అవినీతిని తొలగించేందుకు భారీ సంస్కరణలు రావాలి. ప్రతి కార్యాలయంలో సేవల వివరాలు అవి పొందే విధివిధానాలు ఏ పని ఏ రోజులో చేస్తారో వివరించే ఫిజికల్ చార్టులు ప్రకటించాలి. ఇవన్నీ సక్రమంగా అమలుజరిగేలా చూడాలి, పారదర్శకతకోసం సమాచార హక్కు ద్వారా సమగ్ర సమాచారాన్ని ప్రజల ముందుంచాలి. కేంద్రీకృత పాలనే అవినీతికి మూలం. దీనికి విరుగుడు అధికార వికేంద్రీకరణే. జవాబుదారీతనంతో స్థానిక ప్రభుత్వాలు సాధించాలి. మన దేశాన్ని అవినీతి రహిత దేశంగా రక్షించుకునే దిశగా ప్రతి ఒక్కరూ అవినీతికి వ్యతిరేకంగా ప్రతిన బూనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధుల అవినీతి, అక్రమార్జనపై కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.