ఫోకస్

అభివృద్ధి కోసమే పునరేకీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ నాయకులు తరచుగా పార్టీలు మారుతుంటారు. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణ విషయం. పార్టీలు మారడం తప్పయితే న్యాయవ్యవస్థ అవసరమైతే జోక్యం చేసుకుంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగానికి లోబడే మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. చట్టసభల పరిధిలో చట్టసభలు, న్యాయ వ్యవస్థ పరిధిలో కోర్టులు పనిచేస్తుంటాయి. ఎవరి అధికారాలు వారికున్నాయి. తెలంగాణ అభివృద్ధికోసం వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, చట్టసభల సభ్యులు, నాయకులు టిఆర్‌ఎస్ వైపు ఆకర్షితులయ్యారు. టిఆర్‌ఎస్‌లో చాలా మంది చేరారు. ఇది రాజకీయ పునరేకీకరణ మాత్రమే. తెలంగాణ ఏర్పాటు తర్వాత అభివృద్ది కోసం కలిసొచ్చే వారి సహకారం కూడా తీసుకుంటున్నారు. ఇందులో ఎలాంటి తప్పు లేదు. బంగారుతెలంగాణ సాధించడమే కెసిఆర్ ప్రధాన లక్ష్యమని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి ఆలోచనలమేరకే మేమంతా కలిసి నడుస్తున్నాం. గత మూడేళ్ల నుండి తెలంగాణకు చెందాల్సిన నిధులు, నీళ్లు, ఉద్యోగాలు దక్కుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర వార్షిక బడ్జెట్ తయారు చేస్తున్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ తదితర వెనుకబడిన కులాలతో పాటు ఇతరుల అభివృద్ధికి బృహత్ ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో ఇప్పుడు ముందు వరసలో నిలుస్తోంది. వ్యవసాయ రంగం అభివృద్ధికి కెసిఆర్ చేస్తున్న కృషి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయడంలేదు. వృత్తిపరమైన పనుల్లో ఉన్న వారికి ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి అనుగుణంగా పరికరాలు అందిస్తూ, ఉపాధి కల్పిస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా బంగారు తెలంగాణ ఏర్పాటు కావడం ఖాయం.

- గువ్వల బాలరాజు
ఎమ్మెల్యే, అచ్చంపేట, నాగర్‌కర్నూలు జిల్లా