ఫోకస్

జనామోదంతోనే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక పార్టీ గుర్తుపై గెలిచిన తరువాత పార్టీ మారాలంటే, ఎమ్మెల్యేకైనా, ఎంపికైనా ధైర్యం ఉండాలి. ఆ ప్రజా ప్రతినిధి పార్టీ మారడానికి అక్కడి ఓటర్లు, పార్టీ క్యాడర్ అంగీకరించాలి. జనం అంగీకరిస్తే పార్టీ మారినా ఇబ్బంది లేదు. పార్టీల మార్పిడికి తెర తీసింది అప్పటి సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టి, తెలుగుదేశం పార్టీ నుంచి ఎమెల్యేలను ఆయన పార్టీలోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలోకి ఎమ్మెల్యేలు, ఎంపిలు వస్తున్నారంటే, దానికి కారణం అభివృద్ధి, ఆయన నాయకత్వ సామర్థాన్ని చూసి మాత్రమే. జగన్ నాయకత్వానికి విసిగిపోయి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారు. ఆ పార్టీలోని సీనియర్లు కూడా విసిగిపోతున్నారు. జగన్ నాయకత్వం కన్నా, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని వారు కోరుకుంటున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టినప్పుడు మాట్లాడని వాళ్ళు, ఇప్పుడు తెలుగుదేశంలోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చినప్పుడు నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నారంటూ విమర్శించడం ఎంతవరకూ సమంజసం? నేడు టిడిపిలోకి వస్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజామోదం పొందిన తరువాతే వస్తున్నారు. పార్టీలు మారడం మంచిదా కాదా అన్న విషయం కన్నా, ఎందుకు మారుతున్నారు అన్న విషయాన్ని గుర్తించాలి. ఒక పార్టీని కాదని, వేరొక పార్టీలోకి వచ్చిన ప్రజా ప్రతినిధులు కూడా ఆ నాయకత్వం మీద నమ్మకం ఉంచి, వారితో కొంతకాలం కలిసి ప్రయాణం చేయాలి.
-వంగలపూడి అనిత, పాయకరావుపేట ఎమ్మెల్యే (విశాఖ)