ఫోకస్

నమ్మకాన్ని దెబ్బతీస్తున్న ఫిరాయింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్టీ ఫిరాయింపులు ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పెరిగిపోయిన తీరు ప్రజల్లో రాజకీయ, ప్రజాస్వామిక వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. నైతిక విలువలు విస్మరించి పదవుల కోసం, డబ్బు కోసం పార్టీలు మారుతున్న ప్రజాప్రతినిధుల వైఖరి ఓట్లు వేసి వారిని ఎన్నుకున్న ప్రజల తీర్పును అవమానించడమే. పార్టీ ఫిరాయింపుల నిరోథక చట్టం ఫిరాయింపులకు అడ్డుకట్ట వేయడంలో ఘోరంగా విఫలమైంది. ఫిరాయింపు దారులపై వేటు వేయాల్సిన చట్టసభల స్పీకర్లు రాజకీయ కారణాలతో వెనుకడుగు వేయడంతో పార్టీ ఫిరాయింపులు యథేచ్ఛగా కొనసాగడానికి దారితీస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలే పార్టీ ఫిరాయింపుదారులను ఎన్నికల్లో చీత్కరించడం ద్వారా ఫిరాయింపు రాజకీయాల నిర్మూలన దిశగా చైతన్యవంతంగా వ్యవహరించాల్సివుంది. చట్టంతోనే ఫిరాయింపు రాజకీయాలకు పరిష్కారం లభించదు. ప్రజాచైతన్యం కూడా కావాలి. ఇందుకోసం ప్రజాతంత్ర వాదులు ప్రజాచైతన్యానికి కృషి చేయాలి. ఫిరాయింపు పాపంలో అధికార, ప్రతిపక్ష బూర్జువా పార్టీలన్ని భాగస్వామ్యంగానే ఉన్నాయి. ఫిరాయింపుదారులను మంత్రులుగా చేయడం రాజ్యంగ, ప్రజాస్వామిక, ఎన్నికల వ్యవస్థలను అపహాస్యం చేయడమే అవుతుంది. ఇంతటి బరితెగింపు రాజకీయాల ప్రక్షాళనకు పార్టీ మార్పిడి నాయకులను ప్రజలు ఎన్నికల్లో ఓడించి గుణ పాఠం చెప్పాలి. అటు ఎన్నికల కమిషన్‌కు ఓక పార్టీపై గెలిచి మరో పార్టీలో చేరిన వారిపై వేటు వేసే అధికారాలు ఉండేలా చట్టం తేవాలి. అలాగే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు చేసి మరింత కఠినంగా చట్టాన్ని తీసుకరావాలి. తెలుగు రాష్ట్రాల్లో డబ్బు, అధికారమే పరమావధిగా అవకాశవాదంగా, అనైతికంగా పార్టీలు ఫిరాయిస్తున్నారు. ఈ ధోరణి మునుముందు తెలుగు రాష్ట్రాల్లో మరింత అధికమయ్యే పరిస్థితి కనిపిస్తుండటం ఆందోళనకరం. బలనిరూపణ లెక్కల అవసరం సైతం లేకుండానే తెలుగు రాష్ట్రాల్లో పార్టీ మార్పిడిలు యథేచ్చగా సాగుతుండటం, ఫిరాయింపుదారులు మంత్రులుగా కొనసాగుతుండటం రాజకీయాల్లో విలువల పతనాన్ని చాటుతుంది. గతంలో చంద్రబాబునాయుడు నాంది పలికిన పార్టీ ఫిరాయింపులను వైఎస్సార్ ఉదృతం చేయగా తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు చంద్రబాబు, సీఎం కెసిఆర్‌లు కొనసాగిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులు రాజకీయాల పట్ల యువతరంలో చిన్నచూపును కల్గించేవిగా ఉన్నాయి. చట్టాలను తయారుచేసి అమలు పరిచే ప్రజాప్రతినిధులు బాధ్యతగా నైతికంగా వ్యవహరించి ఆదర్శంగా ఉండాల్సివుందని ఇందుకోసం పార్టీల మార్పిడి రాజకీయాలకు అన్ని పార్టీలు దూరంగా ఉండి నీతివంతమైన రాజకీయాలకు దారి చూపాలి. పార్టీ ఫిరాయింపులు ఏ రూపంలో ఉన్నా సిపిఎం తీవ్రంగా ఖండిస్తుంది.
- తమ్మినేని వీరభద్రం, సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి